ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు.. చంద్ర‌బాబు కొత్త వ్యూహం!

టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న సీఎం చంద్ర‌బాబులో క‌నిపి స్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రెండు కీల‌క అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది.

ఇప్ప‌టికే అనేక సార్లు.. చంద్ర‌బాబు ఈ విష‌యంపై త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌తి కేబినెట్ మీటింగ్‌లోనూ.. మంత్రుల‌కు కూడా హిత‌వు ప‌లుకుతున్నారు. ఎమ్మెల్యేల‌ను కంట్రోల్ చేయాలంటూ.. ఆయ‌న ప‌దే ప‌దే నూరిపోస్తున్నారు.

అయినా.. ఎమ్మెల్యేల దూకుడు ఆగ‌డం లేదు. దీనిపై ప‌దే ప‌దే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తున్నారు.

దీనిలో సీనియ‌ర్లు, మంత్రులు కూడా ఉండ‌నున్నారు. వీరు తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేల ప‌నితీరును కూడా అంచ‌నా వేయ‌నున్నారు.

ఇలా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి ఆదాయ వ్య‌యాలు.. వంటివాటిని మదింపు చేయ‌నున్న‌ట్టు చెబుతున్నారు. త‌ద్వారా… వారిని నేరుగా చంద్ర‌బాబు కోర్టులోనే నిల‌బెట్టి.. చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిసింది.

అయితే.. ఇది పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.. ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిలో సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కులే చాలా మంది ఉన్నారు.

అందుకే.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. ఎవ‌రూ మాట వినిపించుకోవ‌డం లేదు. పైగా చంద్ర‌బాబు ను కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ క‌మిటీ వేయ‌డం ద్వారా.. కొంత‌లో కొంత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

మ‌రీ భ‌యం లేకుండా పేట్రేగుతున్న కొన్ని జిల్లాల నాయ‌కులకు ఆ మాత్రం భ‌యం క‌ల్పించాలన్న ఉద్దేశంతో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.