తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌పై మరోసారి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండు రోజు లుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సరస్వతి షేర్ల వ్యవహారంలో షర్మిల మరోసారి వివరణ ఇచ్చారు. అసలు ఈ కేసు బయటకు ఎలా వచ్చిందనేది జగన్‌కే తెలియాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తనపై కక్షగట్టి ఆ కసిని తల్లిపై చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ప్రజలను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖను ఆమె .. మీడియాకు విడుదల చేశారు.
ప్రధానంగా జగన్ ఒక సెటిల్‌మెంటుకు తమతో సిద్ధమయ్యారని షర్మిల తెలిపారు. అయితే.. ఆ సెటిల్మెం టుకు తాను ఒప్పుకోలేదన్నారు. అందుకే తనపై కక్ష కట్టినట్టు షర్మిల పేర్కొన్నారు. “ఇంతకీ సెటిల్మెం టు ఏంటంటే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయి తే.. ఇలా జరగడానికి.. షర్మిల కూడా ఒక కారణమని వైసీపీనాయకులు భావించారు. ఈ క్రమంలో నాతో రాజీ చేసుకునేందుకు ప్రయత్నించారు“ అని షర్మిల వివరించారు.
రాజీలో భాగంగా.. షర్మిల ఇక నుంచి జగన్‌ను కానీ, అవినాష్‌ను కానీ, భారతిని కానీ విమర్శించకూడదన్న కండిషన్లు పెట్టారని ఆమె పేర్కొన్నారు.(అయితే.. దీనికి గాను తనకు ఏమిస్తారన్నది షర్మిల స్పష్టం చేయ లేదు) కానీ, విమర్శలు చేయడం.. అనేది తన రాజకీయ వృత్తి ధర్మం కాబట్టి.. తాను అందుకు ఒప్పుకో లేదని షర్మిల తెలిపారు. అందుకే సెటిల్మెంటు రద్దయిందని.. దీనిని మనసులో పెట్టుకునే ఇప్పుడు.. తనపై ఉన్న కక్షతో తన తల్లి విజయమ్మను కోర్టుకు ఈడ్చారని షర్మిల పేర్కొన్నారు.
మా అమ్మపైనే కేసు..
కానీ, ఈ సందర్భంగా షర్మిల కీలక విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్ సీఎల్‌టీలో జగన్ కేసు వేసింది.. తన పై కాదని.. కేవలం తమ మాతృమూర్తిపైనేనని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆమె తరఫున తాను మాట్లాడా ల్సి వచ్చిందని.. ఏదైమైనా.. ఈవిషయాన్ని చాలా రోజులుగా కడుపులోనే దాచుకున్నామన్నారు. కానీ, ఎలా బయటకు వచ్చిందో వైసీపీ నాయకులే చెప్పాలని ఆమె నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates