వైఎస్ ఆత్మలుగా పేరు తెచ్చుకున్నవారు.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేళ్లు పొందిన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడి ఆస్తులు-పంపకాలు అంటూ గగ్గోలు పెడుతుంటే.. నాడు అన్నీ దగ్గరుండి చూసుకున్న వైఎస్ ఆత్మలు.. బంధువులు.. వియ్యంకులు.. తోడళ్లుళ్లు.. ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఇదీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ.
ఎందుకంటే.. రాను రాను.. రగడ పెరిగిపోతోంది. వైఎస్ ఆస్తుల వ్యవహారం.. జగన్‌కు షర్మిలకు మాత్రమే పరిమితం కాకుండా.. వైఎస్‌కు చెందిన కీలక ఆస్తులుగా పేర్కొంటున్నవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో నిజానిజాలు ఏంటి? వాటిని ఎవరికి ఎప్పుడు ఎలా ఇచ్చారు? అనే విషయాలు తెలిసిన వారు ఉన్నారు. లేదా.. ‘పెద్దలుగా’ నిలబడి.. సర్దు చెప్పాల్సిన అవసరం ఉన్న వారు కూడా ఉన్నారు. అయినా.. ఏ ఒక్కరూ ఇప్పుడు మాట్లాడడం లేదు.
మా తోడల్లుడే అని చెప్పుకొన్న వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ ఆత్మగా పరిచయం అయి.. గల్లి నుంచి ఢిల్లీ వరకు చక్కబెట్టిన కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఎవరికి భయపడుతున్నారు? అనేది చర్చ. ఎవరూ ఎటువైపూ నిలవాల్సిన అవసరం లేదు. అసలు జరిగిందేదో .. మీడియా ముఖంగా చెప్పేస్తే.. వైఎస్ ఆత్మ అయినా క్షోభించకుండా ఉంటుంది కదా!? కానీ, ఎవరూ ఇలాంటి సాహసం చేయడం లేదు. ఎవరూ మీడియా ముందుకు కూడా రావడం లేదు.
ఇక,వైఎస్ హయాంలోనే ఆయన కంపెనీలకు.. ఆడిటర్‌గా వ్యవహరించి.. ప్రస్తుతం వైసీపీలో కీలక నాయ కుడిగా ఉన్న వి. విజయసాయిరెడ్డి చుట్టూ కూడా అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి.ఆ యనకు తెలియకుం డా.. ఆస్తులు ఉండవని అంటున్నారు. వైఎస్ హయాంలో అన్ని వ్యాపారాలకు ఆయనే ఆడిటర్‌గా వ్యవహరించారు. సో.. కనీసం.. ఆయనైనా.. నిజాలు చెబితే.. ఈ రగడలో వైఎస్ కు ఒకింత ఉపశమనం దక్కుతుంది. కానీ, ఇలా ఎవరూ స్పందించకుండా.. మౌనంగా ఉండి.. వైఎస్ కుటుంబంరోడ్డున పడితే చూడాలని అనుకోవడం.. చిత్రంగా ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates