Political News

నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

తాను అధికారంలోకి వ‌చ్చేందుకు పార్టీ పెట్ట‌లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. కేవలం ఒక ఆశ‌యం కోసమే తాను రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. సామా న్యుడికి అండగా నిలవాలన్నదే తన అజెండా అని వివరించారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ …

Read More »

కొంద‌రు వ‌స్తున్నారు.. మ‌రికొంద‌రిని తెస్తున్నారు..!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సమ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కొందరు నేత‌లు తమంత‌ట తామే పార్టీలు మారేందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం వేచి చూస్తున్నారు. ఇలా వేచి చూస్తున్న వారిని పార్టీలే చొర‌వ తీసుకుని మ‌రీ వెళ్లి క‌లిసి.. పార్టీలో చేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. ఒక ర‌కంగా.. ఇప్పుడు కొంద‌రు తమంత‌ట తామే వ‌స్తుండ‌గా.. మ‌రికొంద‌రిని నాయ‌కులే వెళ్లి తీసుకువ‌స్తున్నారు. …

Read More »

పదేళ్ళ ప్రస్తానం.! ఈసారి అత్యంత కీలకం.!

జనసేన పార్టీ ఆవిర్భవించి పదేళ్ళవుతోంది. పదో వార్షికోత్సవ వేడుకల్ని జనసేన పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల సంవత్సరం గనుక, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఓ బహిరంగ సభను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరిపి వుంటే బావుండేది. అయితే, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక.. వంటి కీలక వ్యవహారాల్లో తలమునకలై వున్న జనసేనాని, బహిరంగ సభ ఆలోచనని చివరి నిమిషంలో విరమించుకున్నట్లు తెలుస్తోంది. …

Read More »

టీడీపీకి తాత్కాలికం-బీజేపీకి శాశ్వ‌తం..!

రాజ‌కీయాల్లో జ‌రిగే అనూహ్య‌మైన ప‌రిణామాలు.. ఒక్కొక్క‌సారి చిత్రంగా ఉంటాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా.. త‌న‌కు షెల్ట‌ర్ ఇచ్చిన పార్టీకి ఎప్పుడూ.. డ్యామేజీ చేసిన సంద‌ర్భాలు లేవు. కానీ.. బీజేపీ అలా కాదు.. ఒంటె సామెత మాదిరిగా.. త‌న‌కు అనను కూలంగా ఉన్న రాష్ట్రాల్లో ముందు వేలు పెడుతుంది.. త‌ర్వాత‌.. మొత్తం ఆక్ర‌మిస్తుంది. ఇలాంటి మ‌న‌స్తత్వం ఉన్న పార్టీల‌తో జ‌ట్టుక‌లిపేందుకు ప్రాంతీయ పార్టీలు సాహ‌సించ‌డం లేదు. కానీ, ఏపీలో చంద్ర‌బాబు …

Read More »

ఫిక్స్‌.. మ‌ల్లారెడ్డి కూడా జంపే!

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయ‌న‌ అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జంప్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వారు బీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే.. కొన్ని రోజుల కింద‌ట‌ భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. త‌ర్వాత ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం …

Read More »

‘మీరు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చా.. ఆశీర్వ‌దించండి’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారి పేర్ల‌ను విడుద‌ల చేశారు. గ‌తంలోనే తొలి జాబితా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అప్ప‌ట్లో 94 మంది అభ్య‌ర్థుల‌ను ఏక‌బిగిన విడుద‌ల చేసేశారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కిన 144 స్థానాల్లో మిగిలిన 50 సీట్ల‌కు సంబంధించి 34 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో కొంద‌రు వార‌సుల‌కు కూడా టికెట్లు కేటాయించారు. అదేవిధంగా …

Read More »

చంద్ర‌బాబు ఫోన్‌.. బోడే ఆన్ ఫైర్

ప్ర‌స్తుతం అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంపై ఆచి తూచి అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రెండు జాబితాలు విడుద‌ల చేశారు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మందికి అవ‌కాశం ఇచ్చారు. అయితే.. కీల‌క‌మైన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఆయ‌న ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. ఇలాంటి వాటిలో పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. తాజాగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు ఫోన్ …

Read More »

చివ‌ర‌కు కేసీఆర్ బుజ్జ‌గించినా విన‌లేదు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వ‌యంగా పిలిచి.. చాలించి.. బుజ్జ‌గించారు. టికెట్ ఇస్తామ‌ని కూడా చెప్పా రు. అయినా… ఆయ‌న వినిపించుకోలేదు. రావ‌డ‌మైతే వ‌చ్చారు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేదంటూ.. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న హైడ్రామాకు తెర కూడా దించారు. కానీ, మ‌న‌సు మాత్రం మార్చుకోలేక పోయారు. చివ‌ర‌కు తాను చేయాల‌ని అనుకున్న‌దే చేస్తున్నారు. ఆయ‌నే ఆరూరి ర‌మేష్‌. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. తాజాగా ఆయ‌న బీజేపీలో …

Read More »

పవన్ పిఠాపురం.. వ‌ర్మ వెటకారం

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అదే.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచితాను కూడా పోటీ చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. “మీకో బ్రేకింగ్ న్యూస్‌.. నేను పిఠాపురం నుంచి పోటీ …

Read More »

పవన్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..అఫీషియల్

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 సీట్లలో కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో, మిగతా 16 మంది అభ్యర్థులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న …

Read More »

ఆ సీట్ల‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా ప్ర‌క‌టించిన రెండో అభ్య‌ర్థుల జాబితాలో 34 స్థానాల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో కొన్ని స్థానాలు.. కొన్నాళ్లుగా వివాదంలో ఉన్న‌వే. అయితే, వాటికి ప‌రిష్కారం చూపించారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం గోపాల‌పురంలో యువ నాయుకుడు, మాదిగ వ‌ర్గానికి చెందిన మ‌ద్దిపాటి వెంక‌ట రాజును ఇంచార్జ్‌గా నియ‌మించారు. కానీ, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కే టికెట్ …

Read More »

టీడీపీలో చేరిన వైసీపీ బీసీ ఎంపీ!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. అయితే, ఈయ‌న‌కు మ‌ర‌లా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా?  లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో క‌ర్నూలు నుంచివిజ‌యం ద‌క్కించుకున్న సంజీవ్‌కుమార్ సౌమ్యుడిగా ముద్ర‌ప‌డ్డారు. ఉన్న‌త విద్యావంతుడు, నిగ‌ర్వి కూడా కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఆయ‌నంటే …

Read More »