ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. సుగాలీ ప్రీతి అనే విద్యార్థిని పాఠశాలలో ఉరి వేసుకొని మృతి చెందిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ కేసును గత ప్రభుత్వం విస్మరించిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ పున:ప్రారంభించామని అన్నారు.
సుగాలీ ప్రీతి కేసులో యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నామని. ఆడబిడ్డల భద్రత చాలా కీలకమని అన్నారు. పాఠశాలల్లో ఆడబిడ్డల భద్రత కోసం…సీసీటీవీ కెమెరాలు పెట్టే ప్రతిపాదనల గురించి సీఎం చంద్రబాబు కూడా యోచిస్తున్నారని చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే చర్యలు చేపట్టేందుకు కెమెరాలుండాలని వవన్ అభిప్రాయపడ్డారు. కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates