కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలోనే కడపలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు.
మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లోని 6వ తరగతి విద్యార్థినీవిద్యార్థులతో పవన్ చిట్ చాట్ చేశారు. వారందరి పేర్లను అడిగి తెలుసుకున్న పవన్..పేరుపేరున ఆప్యాయంగా పలకరించారు.