బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిడ్ డే మీల్స్ ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, పాఠశాలలో విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో కలిసి పోయి కింద కూర్చొని చంద్రబాబు, లోకేష్ భోజనం చేశారు.
విద్యార్థులకు ఏ రోజు ఏ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని మిడ్ డే మీల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చక్కెర పొంగళి పెడుతున్నారా అని ప్రశ్నించారు. సాదాసీదా వ్యక్తులుగా కింద కూర్చొని విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనం పథకం ఆహారాన్ని రుచి చూసిన చంద్రబాబు, లోకేశ్ లపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
గత ప్రభుత్వంలో నాయకులు ఏనాడూ ఇలా విద్యార్థులతో కూర్చొని భోజనం చేసిన దాఖలాలు లేవని నెటిజన్లు అంటున్నారు. పిల్లలకు అందించే ఫల్లీ చిక్కీలపై కూడా తన ఫొటో వేసుకున్న జగన్ విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై దృష్టిపెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. త్వరలో ఇంటర్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెట్టాలని మంత్రి నారా లోకేశ్ యోచిస్తున్నారని, గత ప్రభుత్వం లో ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు అని లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.