టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ పొలిటిషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అయితే, టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ …
Read More »న్యాయం కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు!
న్యాయం కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటున్నారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన వెంటనే లాయర్ లూథ్రా ఢిల్లీ నుంచి చంద్రబాబు వైపు ఆయన వాదనలు వినిపించడానికి ఏపీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన వాదనలు వినిపించిన తరువాత బాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన తిరిగి ఢిల్లీకి …
Read More »కేటీఆర్ సూటి ప్రశ్న.. జవాబు చెప్పలేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ!
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలంటే వాటి బలహీనతలను పసిగట్టాల్సి ఉంటుంది. ఆ బలహీనతలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే, అప్పుడు అనుకున్న ఫలితం దక్కుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా అదే మార్గంలో సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీని సిద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా చెక్ పెడుతూ కేటీఆర్ సాగుతున్నారనే టాక్ ఉంది. తాజాగా సీఎం …
Read More »బాబు అరెస్టు పై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
స్కిల్ ట్రైనింగ్ కేసులో అరెస్టై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా రాజకీయ నేతలే కాకుండా వివిధ వర్గాల వారు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న బాబు భద్రత, ఆరోగ్య పరిస్థితిపై సైతం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ యువనేత నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం …
Read More »చంద్రబాబుతో పవన్ ములాఖత్..హై అలర్ట్
రాజమండ్రికి పవన్..చంద్రబాబుతో ములాఖత్టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ లకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. దీంతో, మరికొద్ది రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి జైల్లో చంద్రబాబును జనసేన అధినేత పవన్ …
Read More »కొత్త పాయింట్ పట్టిన కేటీఆర్!
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్నదే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ లక్ష్యం. అందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయారు. ఇక పార్టీలో కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు కూడా పార్టీ విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోసారి తెలంగాణ వాదాన్ని తెరమీదకు తెస్తూనే.. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ …
Read More »అసలు చంద్రబాబు వ్యూహమేంటి?
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదో చిన్న కేసని.. చంద్రబాబును జగన్ సర్కారు ఏమీ చేలేదని.. బాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని.. ఆయన సింపుల్‌గా ఇలా అరెస్ట్ అయి అలా బయటికి వచ్చేస్తారని తెలుగుదేశం వర్గాలు తొలి రోజు ధీమాగా ఉన్నాయి. కానీ వారి అంచనాలకు భిన్నంగా కోర్టు …
Read More »చంద్రబాబు సీఐడీ కస్టడీకి హైకోర్టు బ్రేక్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హౌస్ కస్టడీకి అప్పగించాలని ఆయన తరపు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు మరో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. …
Read More »ముస్లింల ఓట్లు ఎటువైపు ?
ఇపుడిదే కాస్త సస్పెన్సుగా మారింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చాలా సామాజికవర్గాల ఓట్లు ఎంతో కీలకంగా మారబోతున్నాయి. ఇందులో భాగంగానే ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా కీలకపాత్ర పోషించబోతోంది. ఒక అంచనా ప్రకారం తెలంగాణాలో ముస్లింల ఓట్లు 40 నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. వీళ్ళ ఓట్లకోసమే కేసీయార్ మైనారిటిలకు లక్ష రూపాయల సాయం అనే పథకాన్ని పట్టుకొచ్చారు. అయితే పథకాన్ని …
Read More »చికోటికి బ్రేక్..పెద్ద షాక్
బీజేపీలో చేరాలని అనుకున్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కు బ్రేకులు పడ్డాయి. పార్టీలో చేరేందుకు చికోటి అన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. కేంద్రమంత్రి, తెలంగాణా అద్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లిలోని పార్టీ ఆఫీసు ముందు భారీ కటౌట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. వందలాది వాహనాల్లో మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఆఫీసుకు వెళ్ళిన …
Read More »తెలంగాణలో ఎన్నికలు ఇప్పట్లో లేవని కేటీఆర్‌కు అర్థమైందా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే దఫా ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా మరోవైపు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలను ఎదుర్కునే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా అనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ సమయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ …
Read More »చంద్రబాబును కలిసిన భువనేశ్వరి..ఎమోషనల్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు అనుమతించారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి..జైలులో చంద్రబాబును కలిశారు. వారితోపాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ వచ్చినప్పటికీ అనుమతి లేక జైలు బయట ఉండాల్సి వచ్చింది. దాదాపు …
Read More »