భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను గురువారం సాయంత్రం చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిం చారు. ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మన్మోహన్ మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెర తీసిన గొప్ప ఆర్థిక వేత్తగా మన్మోహన్ సింగ్ కు ఖ్యాతి గడించారు.
దివంగ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన గొప్ప ఎకనమిస్ట్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానిగా పనిచేశారు. 2024లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు.
1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని (ఇప్పటి పాకిస్తాన్) గాహ్ గ్రామంలో మన్మోహన్ జన్మించారు. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా పీవీ హయాంలో పనిచేశారు.