టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచగా…కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు టాలీవుడ్ పెద్దలు ఉంచారు. సమావేశంలో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తనకు కోపం లేదని, తనకు చిన్నప్పటి నుంచి బన్నీ, చెర్రీ తెలుసని, వారితో కలిసి తిరిగారని రేవంత్ అన్నారు.
అయితే, వ్యక్తిగతంగా అల్లు అర్జున్ తో ఉన్న పరిచయం వేరని, చట్ట ప్రకారం ఆ ఘటన నేపథ్యంలో వ్యవహరించామని రేవంత్ చెప్పారు. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చామని, అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్రత నేపథ్యంలోనే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని రేవత్ అన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకే దిల్ రాజును టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, సినీ ప్రముఖులు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఆ కమిటీ కృషి చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో చేశాయని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, పరిశ్రమను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే దిశగా ముందుకు పోతున్నామని చెప్పారు. ముంబైలో మంచి వాతావరణం ఉండడం వల్లే బాలీవుడ్ అక్కడ డెవలప్ అయిందని, బాలీవుడ్ ను కూడా షూటింగుల కోసం హైదరాబాద్ వచ్చేలా చేయాలని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates