ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధ్యంలోని బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదిపి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన గులాబీ దళపతి కేసీఆర్… కొద్దికాలంగా జాతీయ రాజకీయాల విషయంలో స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమితో, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి రాబోయే ఎన్నికలకు దూకుడుగా ముందుకు సాగుతుండ కేసీఆర్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయాల ఎజెండా మాత్రం అసలు క్రియాశీలగా లేదు. అయితే, పార్లమెంటు …
Read More »లోకేష్ పరిణతిని మెచ్చుకోకుండా ఉండలేం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ నాయకత్వానికి తగిన రాజకీయ పరిణతి సాధించారా? ఎత్తులు – పై ఎత్తులకు వేదికైనా ఏపీ పాలిటిక్స్ లో…. తన తండ్రి, టీడీపీ రథసారథి చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే చతురతను లోకేష్ సాధించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. స్కిల్ ట్రైనింగ్ స్కాంలో …
Read More »దారి లేని బీజేపీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ?
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపక తప్పదా? టీడీపీతో కలిసి వెళ్లడం తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేయడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీతోనే కలిసి సాగుతామని, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడమే …
Read More »జగన్ పల్లెబాట
అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నెలాఖరునుండి జగన్మోహన్ రెడ్డి పల్లెబాట పట్టబోతున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ చాలాకాలంగా అనుకుంటున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతోంది. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నెలాఖరులో పల్లెబాట పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రతి సచివాలయానికి జగన్ ఒకరోజు కేటాయించారు. అదికూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామసచివాలయాలకు ప్రాధాన్యతివ్వబోతున్నారట. ప్రతి మండలంలోను సాయంత్రం …
Read More »టీడీపీ ఉద్యమ జోరు.. “బాబుతో నేను”కు విశేష స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సహా ఆయనను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబును అక్రమంగా వైసీపీ ప్రభుత్వం జైల్లో ఉంచిందని, ప్రభుత్వం చెబుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అంటూ ఏమీ లేదని.. ఇదంతా రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగమేనని… పేర్కొంటూ.. టీడీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘చంద్రబాబుతో నేను’- అనే శీర్షికతో ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో నాయకులు, …
Read More »భువనేశ్వరికి..చంద్రబాబును కలిసే ఛాన్స్ ఇవ్వని అధికారులు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వయసు, హోదా రీత్యా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆయన కుటుంబం, ముఖ్యంగా బాబు సతీమణి భువనేశ్వరి తీవ్ర ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారుకూడా. ఈ క్రమంలో తన భర్తను మరోసారి పరామర్శించేందుకు, ఆయనకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు భువనేశ్వరి ప్రయత్నించారు. ఈ క్రమంలో …
Read More »జనసేన-టీడీపీ…”స్వీట్” షేరింగ్!!
ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీడీపీతో కలిసి పోటీ చేయనున్నామంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన దరిమిలా రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య బంధం ద్రుఢతరం కాబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. జనసేనాని ప్రకటనను ఇరు పార్టీల నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా.. స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా.. ఇరు పార్టీల నేతలు కూడా స్వీట్లు పంచుకుని సంబరాలు …
Read More »చిన్నమ్మ రక్తం ఉడుకుతోంది కానీ…!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ కోపంతో రగిలిపోతున్నారట. ఆమె రక్తం 100 డిగ్రీల సెల్షియస్‌లో రగిలిపోతోందట. మాటల తూటాలు, విమర్శల శతఘ్నులతో వైసీపీ సర్కారుపై యుద్ధం చేయాలని ఉందట. కానీ, ఆమె అన్నింటినీ తమాయించుకుని.. పార్టీ అధిష్టానం గీసిన గీతలో తర్జన భర్జన పడుతున్నారట.- ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చ. ఏ ఇద్దరు కమలం పార్టీ నాయకులు కలిసినా.. ఇదే …
Read More »మ్యాజిక్ ఫిగరూ కష్టమేనా ?
బీఆర్ఎస్ అభ్యర్ధులపై పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. కేసీయార్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి నెల రోజులవుతోంది. దీనివల్ల ఒకవైపు అభ్యర్ధులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మహాయితే పోలింగ్ వరకు 20 రోజులుంటే ఎక్కువ. కాబట్టి ఖర్చుల విషయంలో ఏదో మ్యానేజ్ చేసుకుంటారు. కానీ ఇపుడు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు. దీనివల్ల ఏమైందంటే అభ్యర్థుల …
Read More »పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఏంటో అర్థమైపోయింది. అనుకున్నట్లే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయమై నిన్న క్రిస్టల్ క్లియర్‌గా ప్రకటన చేసేశాడు. ఐతే పొత్తును ప్రకటించే విషయంలో పవన్ తొందరపడ్డాడని.. ఇంకా సీట్ల పంపిణీ విషయమై చర్చలే మొదలుకాకముందే హడావుడిగా ఇప్పుడీ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జనసేనలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. దీని వల్ల సీట్ల పంపిణీలో పవన్ బార్గైనింగ్ …
Read More »కాగల కార్యం జగనే సాధించి పెట్టెను
తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు ఎప్పుడో వచ్చేశాయి. పొత్తు అనివార్యం అన్నది అందరికీ తెలుసు. కాకపోతే ఎన్నికలు మరింత దగ్గర పడ్డాక.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పలు దఫాలు సమావేశమై.. సీట్ల పంపిణీలో ఒక అంచనాకు వచ్చి.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొత్తును ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. …
Read More »నారా లోకేష్ ఢిల్లీ బాట
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, తన తండ్రి నారా చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం.. తీసుకున్న నిర్ణయంలో భాగంగా నారా లోకేష్.. ఢిల్లీకి పయనం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు అరెస్టు, స్కిల్ డెవలప్‌మెంటులో స్కాం వంటి అంశాలపై కొందరు జాతీయస్థాయి నాయకులు, చంద్రబాబు మిత్రులు …
Read More »