ఇటీవలే సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డు గురించి కార్తీ సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వుతు తప్పించుకోవడం, దానికి పవన్ సీరియస్ గా స్పందించడం, అటు వైపు క్షమాపణ వచ్చి పరస్పరం శుభాకాంక్షలు చెప్పడం జరిగిపోయాయి. ఇక్కడితో కథ అయిపోలేదు. కార్తీ సారీ చెప్పడం అక్కడి అభిమానులతో పాటు నాజర్ లాంటి కోలీవుడ్ పెద్దలకూ నచ్చలేదు. సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా పవన్ …
Read More »నా దీక్ష తిరుమల లడ్డూ కోసమే కాదు: పవన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు తెరమీదికి వచ్చిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ దీక్షను విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. అలిపిరి మెట్ల మార్గంలో ఆయన ఏడు కొండలు ఎక్కారు. మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »మోడీ వరద సాయం ఏపీ కన్నా మహారాష్ట్రకు ఎక్కువ ఎందుకు?
ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గత నెల 1 నుంచి 15 వ తేదీల మధ్య తీవ్ర వరద వచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో శివారు ప్రాంతాలైతే.. పది రోజుల పాటు వరద నీటిలోనే నానిపోయాయి. ఇక, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక.. ప్రజలు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహనాలు పోగొట్టుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారు. …
Read More »బాబుకు అండ గా నిలిచిన చిన్నమ్మ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ.. సీఎం చంద్రబాబు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. సదరు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇది తనను ఎంతో బాధించిందని ఆయన గత నెల 18న నేరుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. అప్పటి వరకు దీనిపై ఎవరూ కామెంట్ చేయకపోవడం.. అనూహ్యంగా సీఎం స్పం దించడంతో ఇది పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తర్వాత …
Read More »లడ్డూపై `సిట్` విచారణకు బ్రేక్.. ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన పనిని ఆపేసింది. వాస్తవానికి గత రెండు రోజులుగా ఇదే పనిపై సిట్ ఉన్న విషయం తెలిసిందే. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ స్వయంగా రంగంలోకి దిగి.. తిరుమలలో పర్యటించి.. లడ్డూ తయారు చేసే పోటు ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా తిరుమలకు వివిధ …
Read More »దేశంలో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్
హైదరాబాద్ మహానగరాన్ని మరింత సౌకర్యవంతంగా తయారు చేసేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సర్కారు భారీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికి ఉన్న మెట్రో కు అదనంగా మెట్రో ఫేజ్ 2లో భాగంగా 116.2 కిలోమీటర్ల ప్రయాణానికి వీలుగా ఆరు కారిడార్లలో సమగ్ర ప్రాజెక్టు నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రూ.36 వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఈ మెట్రోతో హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని …
Read More »శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేయాలి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలు హిందువుల మనో భావాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై సిట్ విచారణ సాగు తోంది. ఇదేసమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను తీవ్రంగానే పరిగణించింది. ప్రస్తుతం ఈ కేసుపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే.. నెయ్యి కల్తీ ఘటన వ్యవహారంపై నిరసనలు, ప్రజాస్వామ్య యుత ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీసీవై …
Read More »సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. ఏపీ సర్కారు రియాక్షన్ ఇదీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఏపీ ప్రభుత్వం మరోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీ అయిన మాట వాస్తవమని.. తమ వద్ద ఆధారాలు ఉండబట్టే సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. అయితే.. న్యాయపరంగా కొన్ని అంశాలు తెరమీదికి రావడం సహజమేనని అన్నారు. సుప్రీంకోర్టు లేవనెత్తిన …
Read More »నాగబాబు సో లక్కీ !
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపీదేవి వెంకటరమణలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా ఉన్నా వారు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం మూడు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ మూడు పదవులు దక్కేది ఎవరికి ? చంద్రబాబు దృష్టిలో ఎవరు ఉన్నారు ? అన్న చర్చ జోరుగా …
Read More »ఏఐజీ ఆసుపత్రిలో ఆడ్మిట్.. ఎమ్మెల్సీ కవితకు ఏమైంది?
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి.. తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉన్న వేళలో ఆమె ఆరోగ్యం బాగా పాడైనట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజాగా ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆమె వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. ఉదయాన్నే తనకు తానే కుటుంబ సభ్యులతో కలిసి …
Read More »కర్ణాటక సీఎం జైలుకు వెళ్లాల్సిందేనా? పొలిటికల్ రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూముల కుంభకోణం కేసు ఆయన కుటుంబానికి చుట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సిద్దూ సతీమణి పార్వతి సహా బావమరిది మల్లికార్జున స్వామిపై కూడా కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన లోకాయుక్త కేసులను కొట్టి వేయాలని కోరుతూ.. సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో విచారణ జరిగి …
Read More »కాంగ్రెస్‌లో ‘హైడ్రా-మూసీ’ వివాదం.. ఢిల్లీకి రేవంత్
తెలంగాణలో ఆక్రమణలను తొలగించడంతోపాటు మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక విమర్శలు, వివాదాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువచ్చి.. దాని ద్వారా కథ నడిపిస్తున్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తు న్నారు. అయితే.. ఈ వ్యవహారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావరణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీలకమైన పేదలు, మధ్యతరగతి వర్గాల్లో మాత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates