రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం. తమ పార్టీ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలా అని ఆలోచిస్తునే ఎదుటి పార్టీ అభ్యర్ధులను ఎలా దెబ్బకొట్టాలా అని కూడా ఏకకాలంలోనే ఆలోచించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కేసీయార్ చాల జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీచేయటానికి అవకాశం రాని నేతలకు వల విసురుతున్నారట. ఎలాగూ టికెట్ వచ్చే అవకాశంలేదు కాబట్టి బీఆర్ఎస్ …
Read More »ఇక బాబు పై ఆ మరక చెరిగిపొయినట్టే
వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు.. కోర్టులు ఆయన గుప్పెట్లో ఉంటాయి.. స్టేలు తెచ్చుకుని కేసులు ముందుకు సాగకుండా అడ్డం పడతాడు.. ఇలా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైరి పక్షాలు అనేక ఆరోపణలు చేస్తుంటాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని ఆయన మీద ఎంతోమంది వ్యాఖ్యానాలు చేసి .. జనాల్లో కూడా ఆ అభిప్రాయం బలపడిపోయేలా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పరిణామాలు చూస్తుంటే ఈ …
Read More »ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీతో వాతావరణం టెన్షన్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీ గురించి రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు దీనికి అనుమతి లేదని చెబుతున్నారు. అనుమతి లేనిదే ర్యాలీ నిర్వహిస్తే చర్యలు …
Read More »నారా బ్రాహ్మణితో జనసేన మీటింగ్ !
చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కక్షపూరితంగా వ్యవహరించి బాబును జైల్లో పెట్టించారని అధికార వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తు విషయాన్ని జనసేన …
Read More »2019లో జగన్ గెలుపు కోరుకుని తప్పు చేశాను
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు విషయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నరసింహులు ఆదివారం (సెప్టెంబర్ 24) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి తీవ్ర …
Read More »యువగళం మళ్లీ స్టార్ట్
టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడి అరెస్టుతో నిలిపివేసిన యువగళం పాదయాత్రను లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తూనే.. మరోవైపు యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బాబు అరెస్టును మరింతగా తీసుకెళ్లేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని తెలిసింది. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించే ఆలోచనలో టీడీపీ జాతీయ …
Read More »ఇగోని వదిలిపెడితే జగన్ ను ఓడించవచ్చు
జగన్మోహన్ రెడ్డిపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు యుద్ధం ప్రకటించారు. రాబోయే ఆరుమాసాలు చాలా కీలకమైనవని చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనేతల సమావేశంలో నాగబాబు మాట్లాడుతు నేతలందరు ఇగోని వదిలిపెట్టాలన్నారు. రాబోయే ఎన్నికలు జనసేనకు ఎంత కీలకమో అందరు గుర్తించాలన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేంతవరకు నేతలెవరు విశ్రాంతి కూడా తీసుకోకూడదని గట్టిగా చెప్పారు. నేతలు, క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేస్తే జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. …
Read More »జగన్ కు ఇది లాభమా.. నష్టమా..?
పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేసింది. కొత్తగా రూపొందించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)మాత్రమే అమలు చేయబోతున్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంగా చెప్పేశారు. అయితే ఉద్యోగులేమో తమకు జీపీఎస్ వద్దని ఓపీఎస్సే కావాలని పట్టుబడుతున్నారు. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓపీఎస్ ను యూపీఏ ప్రభుత్వం అమల్లోకి రాగానే అంటే 2004లోనే రద్దుచేసింది. 2004కి ముందు ఉన్న ఉద్యోగులకు …
Read More »తగ్గని పొంగులేటి, తుమ్మల.. మరి పాలేరు ఎవరికి?
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కిందామీదా పడుతోంది. దాదాపు 80 స్థానాల్లో అభ్యర్థులను సులువుగానే ఖరారు చేసేలా కనిపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి మిగిలిన స్థానాల్లో ఇబ్బందులు తప్పడం లేదని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూడా …
Read More »మైనంపల్లి ప్లేస్‌లోకి ముగ్గురు లీడర్లను రెడీ చేసిన కేసీఆర్
గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు తెర దించుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేయడమే కాకుండా త్వరలోనే తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, మైనంపల్లి బదులుగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగబోయే నేత ఎవరనే చర్చ జరుగుతుంది. …
Read More »మధుయాష్కీకి కష్టమేనా?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ ఆశలు గల్లంతేనా? ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు భంగపాటు తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. మధుయాష్కీకి ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే అందుకు కారణమని చెప్పాలి. ఈ స్థానిక కాంగ్రెస్ నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ మధుయాష్కీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు తెలిసింది. ఎల్బీ …
Read More »ఇంకొన్ని రోజులు ఢిల్లీలోనే.. లోకేష్ కింకర్తవ్యం?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కింకర్తవ్యం ఏమిటీ? చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తండ్రి చంద్రబాబు రిమాండ్ మీద జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మార్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. …
Read More »