ఒక వివాదం చెలరేగినప్పుడు వెంటనే స్పందించడం అనేది ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ కనిపిస్తోంది. ముఖ్యమంత్రులే ఆయా విషయాలపై స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న, చేసే విమర్శలకు వెంటనేరియాక్ట్ కూడా అవుతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే.. మరింత దూకుడుగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ, మంత్రి కొండా సురేఖకు సంబంధించిన తాజా వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి ఎడతెగని మౌనం పాటిస్తున్నారు. నిజానికి సురేఖ …
Read More »సబిత ఫామ్‌హౌస్ కూలగొట్టాలా? వద్దా?: రేవంత్
బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫామ్ హౌస్‌లు కూడా ఆక్రమణల జోన్‌లో ఉన్నాయని.. వాటిని కూడా కూలగొట్టాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. “సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్‌హౌస్‌లు లేవా?” అని ప్రశ్నించారు. అవి కూడా బఫర్ జోన్‌లోనే ఉన్నాయని తనకు సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాటిని కూలగొట్టాల్నో వద్దో మీరే చెప్పండి అని …
Read More »బీఆర్ ఎస్‌కు భారీ షాక్.. అర్ధరాత్రి హరీష్, కేటీఆర్‌పై కేసులు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లపై సైబరాబాద్ పోలీసు స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి కేసులు నమోదయ్యాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు.. దర్యాప్తును ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. గురువారం రాత్రి రఘునందనరావు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. …
Read More »సరుకు లేని కంపెనీకి కాంట్రాక్టు.. వైసీపీ మరో ముచ్చట!
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ టీడీపీ మరో కీలక విషయా న్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సరుకు లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన వ్యవహారాన్ని తూర్పార బట్టిం ది. ఉదాహరణకు 100 కిలోల బస్తా మోసే వ్యక్తిపై 1000 కిలోలు మోపిన చందంగా వైసీపీ వ్యవహరించింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసేందుకు పలు కంపెనీలను ఎంచుకున్న వైసీపీ ప్రభుత్వం.. పెద్దగా అనుభవం లేని తమిళనాడుకు …
Read More »ఉదయనిధి స్టాలిన్ కు పవన్ వార్నింగ్
సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలి అని తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై జాతీయవ్యాప్తంగా బీజేపీ నేతలు, హిందువులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ వ్యవహారంపై స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ …
Read More »మోడీ కోర్టుకు ‘లడ్డూ’ వివాదం.. ఏం చేసినా తంటానే!
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కోర్టులో పడింది. ప్రస్తుతం ఏపీలో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో సిట్ విచారణను వాయిదా వేశారు. వాస్తవానికి గురువారం ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేలుస్తుందని దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఎదురు చూశారు. అయితే.. అనూహ్యంగా ఈ కేసు వాయిదా …
Read More »7 పాయింట్లతో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్
తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశమంతా ఒకటే గళం వినిపించాలని, జాతి, మత భేదం లేకుండా మాట్లాడాలని వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని పవన్ అన్నారు. సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఎదురు దాడి చేయడం లేదని, ఆవేదన వ్యక్తం …
Read More »జగన్ కేసుల పై పవన్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలో జరుగుతున్న వారాహి డిక్లరేషన్ సభలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై 32 కేసులు పెండింగ్లో ఉన్నాయని, బెయిల్ మీద ఉన్న వ్యక్తి, జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్ముతామని పవన్ ప్రశ్నించారు. జగన్ పై ఉన్న తీవ్రమైన కేసులు చాలా …
Read More »టాలీవుడ్ స్పందన ఓకే.. కానీ, ఈ తేడానే దారుణం!
అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ సీనియర్ మంత్రి, పైగా మహిళా నాయకురాలు కొండా సురేఖ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగా కూడా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉన్నా.. అన్ని వర్గాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు. ఈ క్రమంలో ఆయా వర్గాలు అక్కినేని కుటుంబానికి అండగా నిలిచాయి. ముఖ్యంగా టాలీవుడ్ అయితే.. …
Read More »నాగార్జున శాంతించలేదు
తెలంగాణ మహిళా మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కు కున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని రాజకీయంగా ఆమె రోడ్డుకు లాగేసిన తర్వాత.. పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీల వరకు కూడా అనేక మంది ఆమె తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా నాగార్జున మాజీ కోడలు సమంతను టార్గెట్ చేయడాన్ని చాలా మంది నిరసిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖ తన వ్యాఖ్యలు …
Read More »కోర్టులపై పవన్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పాదాల సాక్షిగా, శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నానని…ఇలా రోడ్డు మీదకు వచ్చి …
Read More »అదే భ్రమలో బతికేస్తున్న జగన్ ..!
భ్రమ- ఆనందపడటానికి మంచిదే కావొచ్చు. కానీ, అన్ని వేళలా భ్రమలో బతికేస్తామంటే ప్రజలు నవ్విపోతారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలోనూ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఆయన ఇంకా భ్రమల్లోనే బతికేస్తున్నారన్నది వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇక, సాధారణ మీడియా మరింత యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల దిశగా ఎవరైనా అడుగులు వేయా ల్సిందే. దీనిలో ఎలాంటి తేడా లేదు. అయితే.. ఆ మార్పు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates