ఒక్క వారంలో బెంగళూరుకు జగన్ రెండు టూర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ… లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు పెద్దగా ఇష్ట పడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెంగళూరుకు వెళ్లే సమయంలో గన్నవరం నుంచి బయలుదేరిన జగన్.,..తిరుగు ప్రయాణంలో మాత్రం గన్నవరానికి కాకుండా బెంగళూరు చేరుకున్నారు.

అక్కడే ఓ మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత గానీ జగన్ తాడేపల్లి రాలేదు. తాడేపల్లి వచ్చిన తర్వాత కూడా జగన్ ఏపీలో ఎక్కువ సమయం గడపలేదు. వైసీపీ చేపట్టదలచిన పీజు పోరును కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో వెనువెంటనే జగన్ తిరిగి ఢిల్లీ వెళ్లారు.

ఆ తర్వాత మొన్న బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన జగన్… మళ్లీ రేపు అదే బెంగళూరుకు వెళుతున్నారు. రేపు కడప వెళ్లనున్న జగన్… అక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తనయుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

ఆ తర్వాత కడప నుంచే ఆయన బెంగళూరు వెళతారు. మరి బెంగళూరు నుంచి జగన్ తిరిగి ఎప్పుడు వస్తారన్న విషయంపై స్పష్టత లేదు. రేపటి బెంగళూరు టూర్ ను లెక్కేసుకుంటే… ఈ వారంలోనే జగన్ ఏకంగా రెండు సార్లు బెంగళూరుకు వెళ్లినట్టైంది.

ఇకపై జగన్ 2.0 పాలన చూస్తారంటూ జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. జగన్ 1.0 పాలనలో పార్టీ కేడర్ కు పెద్దగా దగ్గర కాలేకపోయానని తన తప్పును ఒప్పుకున్న జగన్… తన 2.0 పాలనలో మాత్రం కేడర్ కు అండాదండగా నిలబడతానని తెలిపారు. అయితే .జగన్ 2.0 పాలన రావాలి అంటే 2029 ఎన్నికల్లో వైసీపీ గెలవాలి కదా.

ఎన్నికలు లేనప్పుడు ఇలా టూర్ల మీద టూర్లు వేసుకుంటూ తిరిగితే.. ఎన్నికలకు పార్టీ కేడర్ ను సమాయత్తం చేసేదెప్పుడు…ఎన్నికలు గెలిచేదెప్పుడు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా సరిగ్గా… పార్టీ చేపట్టే నిరసనల రోజే బెంగళూరు వెళ్తున్న జగన్… ఇక తాడేపల్లి కేంద్రంగానే ఉంటూ రాజకీయాలు చేస్తారని ఆశించడం దుర్లభమేనన్న వాదనలూ లేకపోలేదు.