ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేెక గుర్తింపును సంపాదించుకున్న తెలుగు నేత. బీజేపీతో రాజకీయం మొదలుపెట్టి… బీజేపీతోనే రాజకీయాలకు స్వస్తి పలికిన మన నెల్లూరు జిల్లా నేత. దేశ ద్వితీయ పౌరుడిగా ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలు అందించారు.
ఎప్పుడో 1949లో జన్మించిన వెంకయ్య.. ఈ జూలై వస్తే 75 ఏళ్ల వయసును పూర్తి చేసుకుంటారు. అయితేనేం… ఆయన ఇప్పటికీ యమా యాక్టివ్ గా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత పూర్తిగా విశ్రాంతి మోడ్ లోకి వెళ్లిన వెంకయ్య…ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నారు.
తాజాగా తన మనవడు. విష్ణు వివాహం సాత్వికతో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ను ఆదివారం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో వెంకయ్య కుమార్తె ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఘనంగా జరిగింది.
ఈ రిసెప్షన్ కు పలువురు రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తన మనవడి పెళ్లి రిసెప్షన్ కు వచ్చిన ప్రముఖులను రిసీవ్ చేసుకుంటూ… వారితో మాట కలుపుతూ వెంకయ్య ఫుల్ జోష్ లో కనిపించారు. 75 ఏళ్ల వయసులో ఉన్న వెంకయ్య… ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలతో కలిసి నిలబడే మాట్లాఃడిన వెంకయ్య వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.
రాజకీయాల్లో ఉండగా…ఎంతగా యాక్టివ్ గా కనిపించారో…. ఇప్పుడు కూడా వెంకయ్య అంతే యాక్టివ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వయసు మీద పడిన వైనం ఆయన ముఖంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates