వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు సెటర్లు పేల్చారు. “జగన్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా అనుకుంటా.. అప్పుడప్పుడు.. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలని.“ అని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో 80 వేల టన్నుల చెత్తను కనీసం ఎత్తకుండానే వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ వారసత్వ చెత్తను ఇప్పుడు శుభ్రం చేస్తున్నామన్నారు. “జగన్ ఇచ్చిన సంపద ఇదే“ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
గత వైసీపీహయాంలో చెత్తను కూడా ఎత్తలేదని చంద్రబాబు తెలిపారు. ప్రతినెలా చివరి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సైతం పాల్గొని చెత్తను ఏరడంతోపాటు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం.. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తను, అప్పులను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందన్నారు.
దానిని శుభ్రం చేసూఏందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏడాది కిందట స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామని.. చెత్త నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను సృష్టిస్తున్నామన్నారు.
అదేవిధంగా.. చెత్త సేకరణ బండ్లను పెంచామని.. చెత్తను ఇచ్చి ఇంట్లో వినియోగించుకునే వస్తువులు తీసుకునే సౌకర్యంకల్పించామని చంద్రబాబు తెలిపారు. చెడు ఆలోచనలతో రాజకీయాలు చేస్తే.. నేరస్తు లు అవుతారని.. వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్‌కు తానే చైర్మన్‌గా వ్యవహరించానని సీఎం తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates