తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. పుష్ప-2 తొక్కిసలాట ఘటన తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పరిణామాల క్రమంలో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే.. దీనిని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రిని కలుసుకుని భేటీ అయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ క్రమంలో …
Read More »టూరిజంతో కాసులు కురిపిస్తున్న కందుల దుర్గేశ్
అదేంటో గానీ… టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కూటమి పాలన ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వెరసి రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటపడటం ఖాయమన్న భరోసా ప్రజల్లో నెలకొంది. కూటమి పాలన ఉన్నంత కాలం ఇక చింతలేదన్న వాదనా అంతకంతకూ బలపడుతోంది. పరిశ్రమల శాఖ ఒక్కటేనా పెట్టుబడులను రాబట్టేది… …
Read More »ఒత్తిడి సహజమే.. తట్టుకుని నిలబడాలి: అయోధ్య రెడ్డి
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్గి చేసిన ప్రకటన… వైసీపీని ఓ రేంజిలో వణికించిందనే చెప్పాలి. సాయిరెడ్డితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడనున్నారన్న వార్తలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఇలా సాయిరెడ్డితో పాటు కలిసి పార్టీకి దూరంగా జరిగే నేతల జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా …
Read More »బండి బాటలో విష్ణు.. గద్దర్ నరహంతకుడని కామెంట్
ప్రజా గాయకుడిగా తెలుగు ప్రజల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్.. దానికి బీజేపీ ప్రతిస్పందించిన తీరుతో నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధమే జరుగుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్.. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు …
Read More »చంద్రబాబుపై కేసులు.. పిటిషనర్ పై సుప్రీం ఫైర్!
వైసీపీ హయాంలో మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వరకు చంద్రబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలై ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో …
Read More »80 :15 : 5… ఏమిటిది?
ఈ అంకెలేమిటి? వాటి మధ్య పర్సంటేజీలను గుర్తు చేస్తున్నట్లుగా ఆ డాట్స్ ఏమిటి? ఏమైనా గణిత పాఠాలు చెబుతున్నారా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇదేమీ మ్యాథ్స్ క్లాస్ కాదు గానీ… ఏపీలోని కూటమిలోని పార్టీల మధ్య కుదిరిన పదవుల పందేరానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం. అసలే మూడు పార్టీలు… అన్ని పార్టీల్లో వందల సంఖ్యలో ఆశావహులు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కదా. అదే …
Read More »బాబుకు థ్యాంక్స్… రేవంత్ పై సెటైర్
తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమైనా తలసరి ఆదాయంలో మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా టాప్ పొజిషన్ లో ఉంది. వాస్తవాలను చెప్పడంలో ఎలాంటి బేషజాలు లేకుండా వ్యవహరించే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని చాలా వేదికలపై ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కూడా. అంతెందుకు మొన్నటికి మొన్నఏపీ సీఎం హోదాలో దావోస్ సదస్సుకు వెళ్లిన సందర్భంగానూ అందరి ముందే చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. …
Read More »ఆ ‘టైగర్’ ఇంకా బతికే ఉన్నాడా…?
తమిళనాట గడచిన రెండు రోజులుగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ వార్తపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఫలితంగా చోటామోటా వెబ్ సైట్లను దాటేసిన ఈ వార్త ఇప్పుడు మెయిన్ మీడియాకూ ఎక్కేసింది. ఫలితంగా సోమవారం తమిళనాడు వ్యాప్తంగా ఈ వార్తే టాప్ ట్రెండింగ్ లో నడిచింది. మరింత కాలం పాటు ఈ వార్త …
Read More »చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ …
Read More »లోకేశ్ ను ఫేస్ చేయాలంటే చాలా కష్టం గురూ..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది పడేవారు. దీంతో కొన్నిమీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆయనను అనవసర ప్రశ్నలు సంధించి ఇబ్బంది పెట్టేందుకు యత్నించేవారు. లోకేశ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అలా కాదు. లోకేశ్ ఆరితేరిపోయారు. ఒకింత నాటుగా చెప్పాలంటే… రాటుదేలిపోయారు. ఇప్పుడు లోకేశ్ ను ప్రశ్నించాలంటే …
Read More »ఢిల్లీ ఎన్నికల దుమ్ము రేపుతున్న ఆప్ మ్యానిఫెస్టో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. ఈ మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, కిరాయిదారులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికీ ఆకర్షణీయమైన హామీలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల మన్ననలు పొందే విధంగా తమ ఎజెండాను రూపొందించింది. ఆప్ మ్యానిఫెస్టోలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ, …
Read More »7 నెలలు.. రూ.6.33 లక్షల కోట్లు.. 4.1 లక్షల ఉద్యోగాలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం వైసీపీ సెటర్లు వేస్తోంది. అంతేకాకుండా నయా పైసా పెట్టుబడి రాబట్టలేని దావోస్ సదస్సుకు ఎంత మేర ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శలు, డిమాండ్లకు స్పందించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం వైసీపీకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. రాష్ట్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates