గోవా.. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. కొన్నికొన్ని ప్రాంతాలు మనకు అదే రోజు దఖలు పడలేదు. ఆ తర్వాత.. జరిగిన చర్చలు, సంప్రదింపుల ద్వారా దేశంలో కలిశాయి. ఇలాంటివాటినే కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గోవా ఒకటి. అయితే.. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అందుకే అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం.
దీనికి తొలిసారి తెలుగు వ్యక్తి గవర్నర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు.. తాజాగా శనివారం ఉదయం.. గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇలా.. తొలితెలుగు వ్యక్తి గోవాకు గవర్నర్ కావడం.. ఇదే ప్రథమం. గతంలో కర్నాటక నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఏపీకి దక్కడం ఇదే మొదటిసారి.
గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్.. ఇతర ఎంపీలు, కొందరు మంత్రులు హాజరయ్యారు. అనంతరం నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతి రాజును అభినందించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. గోవా గవర్నర్‌గా రాష్ట్రానికి కూడా పేరు తీసుకోవాలని ఆకాంక్షించారు.
గోవా ప్రత్యేకతలు ఇవీ..
గోవా విస్తీర్ణం.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర ఉంటుంది. ఇక్కడి జనాభా తాజా లెక్కల ప్రకా రం.. 15 లక్షల మంది. గవర్నర్‌గా అశోక్ గజపతి రాజుకు.. గోవాపైనే కాకుండా.. లక్షద్వీప్‌లపైనా అధికా రం ఉంటుంది. ఇక, పర్యాటక రాష్ట్రంగా గోవా ప్రతిసిద్ధి అన్న విషయం తెలిసిందే. ఆదాయం కూడా.. పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates