ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ 750 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టనున్నారు. పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వం.. రాజధానిలో బాలయ్య చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి 21 ఎకరాలను కేటాయించింది. దీనిలో సమగ్ర కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు బసవ తారకం సంస్థ ముందుకు వచ్చింది. మొత్తం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 21 ఎకరాలకు తోడు మరో 10 ఎకరాలను త్వరలో నే కేటాయించనున్నారు.
భూమిపూజ
రాజధాని అమరావతిలోని తుళ్లూరు సమీపంలో కేటాయించిన 21 ఎకరాల్లో ప్రస్తుతం 15 ఎకరాల్లో నిర్మించే తొలి కేన్సర్ క్యాంపస్‌కు నటుడు బాలయ్య తాజాగా భూమి పూజ చేశారు. ఈ ప్రాంతంలో రెండు దశల్లో అత్యంత అధునాతన రీతిలో కేన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. బుధవారం నిర్వహించిన భూమి పూజలో బాలయ్య సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రెండు దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేన్సర్ ఆసుపత్రి తరహాలో ఇక్కడ కూడా నిర్మాణం ఉంటుందన్నారు.
కాగా.. మొత్తం ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో 1) కేన్సర్ కేర్ క్యాంపస్ 2) రోగుల సంరక్షణకు ఎక్స్‌లెన్సీ సెంటర్ నిర్మించనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 500 పడకల సామర్థ్యంతో రెండో ఫేజ్‌లో 1000 పడకల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. వీటిలో అధునాతన పరికరాలు సమకూరుస్తారు.
ఎప్పటికి పూర్తి?
తొలి దశ కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం 2028 డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుంది. స్థానికులకు అంటే.. భూమిని త్యాగం చేసిన రైతు కుటుంబాలకు ఉచితంగా.. ఏపీ వారికి 25 శాతం చార్జీలతో సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. తొలి దశలో 500 పడకలను ఏర్పాటు చేయనున్నారు.
ఏయే పరీక్షలు చేస్తారు?
1) వ్యాధి నివారణ.
2) ముందస్తు గుర్తింపు
3) చికిత్స
Gulte Telugu Telugu Political and Movie News Updates