అధికారంలో ఉంటే.. ఒకలా, అధికారం కోల్పోతే మరోలా వ్యవహరించడం నాయకుల లక్షణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగల విషయంలో కూడా ఇలానే చేయడం విమర్శలకు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరేస్తారేమో.. పార్టీ కార్యకర్తలు, లేదా తమకు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారేమో.. అని నాయకు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్కడా కనిపించలేదు.
తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ జాడ ఎక్కడా కనిపించలేదు. మరి ఆయన ఉన్నారో.. లేక బెంగళూరుకు వెళ్లారో కూడా సమాచారం లేదు. ఇదిలావుంటే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జగన్, ఓ చిన్న ట్వీట్‌తో సరిపుచ్చారు. ‘సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన స్వాతంత్య్రానికి మూలం. ప్రజాస్వామ్య దేశానికి ఇవే బలంగా నిలుస్తాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఇంతకు మించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కానీ, ప్రసంగాలు చేయడం కానీ.. చేయలేదు.
అంతా సజ్జలే..
మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సర్వం సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి మయంగా మారిపోయింది. పార్టీ తరఫున విజయందక్కించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు చాలా మంది ఉన్నా.. సజ్జలే జెండా ఆవిష్కరించి.. రాజకీయ ప్రసంగం చేయడంతో అందరూ చిన్నబుచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలకు అవకాశం ఇస్తారని.. వారితో జెండా ఆవిష్కరణ చేయిస్తారని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు.
కానీ, దీనికి భిన్నంగా సజ్జలే రాజకీయ ప్రసంగంతోపాటు.. జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోలేదని.. ఓడించారని వ్యాఖ్యా నించారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలను నిర్బంధించి.. వారే ఓట్లు వేసుకున్నారని తెలిపారు. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని.. ప్రజాస్వామ్య వాదులు సహకరించాలని సజ్జల కోరారు. ఇక, గత ఎన్నికల్లో కూడా ఓట్ల చౌర్యం జరిగే.. రాష్ట్రంలో వైసీపీ పరాజయం పాలైందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates