కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొడుతున్నారు. అది కూడా గవర్నర్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ‘ఎట్ హోమ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పక్షంతోపాటు.. ప్రతిపక్షానికి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందుతుంది.
ఇది సాధారణంగా ఉండే ప్రొటోకాల్. ఇక, ఉన్నతాధికారుల నుంచి క్లాస్ 2 అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత సహా.. అందరూ పాల్గొన్నారు. ఇక, ఇతర శాఖల ఉన్నతాధికారులతోపాటు.. డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ ఆహ్వానం మేరకు వీరంతా.. ఎట్ హోమ్‌కు వచ్చారు.
అయితే.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్‌కు కూడా గవర్నర్ నుంచి ఆహ్వానం అదింది. దీనికి ఆయన రావాల్సి ఉంది. ఇది గవర్నర్ గౌరవార్థం నిర్వహించే కార్యక్రమం. దీనిలో రాజకీయాలకు తావులేదు. గతంలో 23 స్థానాలకు పరిమితమైనా.. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఎలాంటి రాజకీయ దగ్ధ మనసులో పెట్టుకోకుండా ఎట్ హోం సహా.. హైటీ వంటి కార్యక్రమాలకు హాజరై.. గవర్నర్‌ను గౌరవించారు. అయినా.. జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా హాజరై.. ఇప్పుడు మాత్రం డుమ్మా కొట్టారు.
“నేను బిజీగా ఉన్నాను.. రాలేను.” అని గవర్నర్‌కు పంపించిన సందేశంలో జగన్ పేర్కొన్నారు. అంటే.. ఆయన ఈ కార్యక్రమాన్ని బాయి కాట్ చేశారన్న మాట. వాస్తవానికి గత ఏడాది కూడా ఎట్ హోం కు ఇలానే డుమ్మా కొట్టారు. అయితే.. అప్పట్లో ఓటమితో ఆవేదనలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ… ఇప్పుడు 15 మాసాల తర్వాత కూడా.. ఆయన రాకపోవడం.. తాను బిజీగా ఉన్నానని సందేశం పంపించడం విమర్శలకు దారితీసింది. గవర్నర్ వ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల జగన్‌కు ఉన్న గౌరవం ఇదేనని.. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చేలా చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates