ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఫీవర్‌తో పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్టు చెప్పారు.
గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారని, అయితే.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీంతో మరింత నీరసించారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయన వచ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి కార్యాలయంలోనే పవన్ రెస్టు తీసుకుంటున్నారు.
వరుసగా బిజీ…
గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడిపారు. వాస్తవానికి ఆయన అనారోగ్యంతో ఉన్న విషయం మంగళవారం వరకు ఎవరికీ తెలియదు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ప్రకటించింది.
అదేసమయంలో ఆయన సోమవారం సాయంత్రం విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. తొలిరోజు శరన్నవరాత్రుల లో అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే.. అనూహ్యంగా సాయంత్రం నుంచి తీవ్రంగా నీరసించి పోవడంతో వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి వైరల్ జ్వరంతో బాథపడుతున్నట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates