దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు. అమెరికాలోని …
Read More »భయం గొల్పుతున్న ముంబయి హాస్పిటల్ ఫొటో
లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే. రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా …
Read More »ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ ?
ఏపీలో మళ్లీ రాజకీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈరోజు రేపట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరు టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. వారు వైసీపీలో చేరకపోయినా… కండువా కప్పుకోకపోయినా మానసికంగా వైసీపీలో చేరిపోయారు. ప్రభుత్వానికి అన్నింటా మద్దతు పలుకుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె …
Read More »శ్రీవారి లడ్డూ ప్రసాదానికి యమా క్రేజ్, గంటల్లో లక్షల విక్రయం
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో …
Read More »చంద్రబాబు అడుగు పెట్టగానే కేసు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎట్టకేలకు మళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. కరోనా వైరస్ ప్రభావం మొదలవగానే ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయి అక్కడే తన సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో తాను ఏపీకి వెళ్లి జనాల్ని కలవడం వాళ్లకు, తనకు మంచిది కాదని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే అధికార పక్షం నుంచి ఎంతగా కవ్వింపులు వచ్చినా ఆయన హైదరాబాద్ …
Read More »టీటీడీ భూముల అమ్మకంపై యుటర్న్?
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు ఇచ్చిన భూముల్ని అమ్మేందుకు రంగం సిద్ధం చేయడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, విమర్శలు రావడంతో టీటీడీ పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. భూముల అమ్మకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేసింది. భూముల అమ్మకాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటూ బోర్డు ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. టీటీడీ భూముల అమ్మకాలపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ భూముల విక్రయంపై …
Read More »శంషాబాద్లో గొడవ గొడవ
కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన విమాన యానాన్ని ఈ రోజే పునరుద్ధరుంచింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా పూర్తి స్థాయిలో కాకపోయినా.. నిర్దిష్ట సంఖ్యలో విమానాల్ని పునరుద్ధరించారు. కొన్ని రోజుల కిందటే బుకింగ్స్ మొదలయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్లంతా టికెట్లు తీసుకుని సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లంతా సోమవారం అన్ని ఏర్పాట్లూ చేసుకుని శంషాబాద్ …
Read More »జగన్ ఆ తప్పు చేయొద్దు – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల అమ్మకాలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీ వేంకటేశ్వరుని పేరిట వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూముల్ని కూడా అమ్మడానికి సన్నాహాలు మొదలయ్యాయి. టీటీడీ ఈ మేరకు భూముల వేలానికి బిడ్లు కూడా ఆహ్వానించింది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ప్రభుత్వ …
Read More »జగన్ తెగింపు ఆమెకు కొత్త టెన్షన్ గా మారిందా?
ఏదైనా విషయం అనుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఎంతకైనా రెఢీ అనే తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కాస్త ఎక్కువే. ఆయన్ను సన్నిహితంగా చూసే వారందరికి ఈ విషయం మీద అవగాహన ఎక్కువే. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలనే పట్టుదల..ఇప్పుడు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. కెరీర్ లో ఇప్పటివరకూ ఎలాంటి …
Read More »వరంగల్ కేసు మిస్టరీ వీడింది
వరంగల్ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది. ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది …
Read More »ఆయన ఏపీలో వైసీపీ ఎంపీ.. ఢిల్లీలో బీజేపీ ఎంపీనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుగా చెబుతారు. మిగిలిన వారి రూట్ కు భిన్నమైన బాటలో ఆయన పయనిస్తుంటారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఆయన సొంతం. అంతేనా.. మోడీషాల అపాయింట్ మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కంటే ముందే ఈ ఎంపీకి ఇస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా.. ఢిల్లీలో …
Read More »సోను సూద్…. ఐ యామ్ ఇంప్రెస్డ్
లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వలసకార్మికులు అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ దేశంలోని పేదలకు ఇంతటి దారుణమైన కష్టం రావటమా? అని వేదన చెందిన వారికి కొదవ లేదు. సొంతూరుకు వెళ్లాలన్న పట్టుదలతో మండే ఎండలో వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్లిన వైనం కడుపు తరుక్కుపోయేలా చేసింది. పసిపిల్లలు.. చిన్నారులు.. ఇంటి …
Read More »