ఏపీ సీఎం జగన్.. త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. తన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పథకాలపై ఆయన ప్రజలకు వివరించనున్నారు. అయితే.. ఈ పర్యటనకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సును వినియోంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. జగన్ చేసే జిల్లాల పర్యటనలకు.. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వినియోగించనున్నారు.. అంటూ. ఫొటోలను కూడా పంచుకుంది. అయితే.. ఈ బస్సులు.. చంద్రబాబు హయాంలో కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో కూడా బాబు జిల్లాల పర్యటన చేయాలని అనుకున్నారు.
కానీ, కుదరలేదు. అయితే.. వీటి కోసం.. రెండు బస్సులను రూ.10 కోట్ల చొప్పున వినియోగించి కొనుగోలు చేశారు. అప్పట్లో చంద్రబాబు కొన్న బస్సుల్లోనే ఇప్పుడు జగన్ పర్యటనలు చేయనుండడం గమనార్హం. ఇక, జగన్ జిల్లాల పర్యటనల మొత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లోనే సాగనుంది. జగన్ జిల్లాల పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు సిద్ధం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బస్సుల సామర్థ్యాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు.
సీఎం జగన్ జిల్లాల పర్యటనల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఏర్పాటు చేయనున్నారు. జగన్ జిల్లాల పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు సిద్ధం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ప్యాంట్రీ వాహనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో బస్సుల సామర్థ్యాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు. రాష్ట్ర విబజన తర్వాత.. 2015లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగించ లేదు. అయితే.. తాజాగా సీఎం జగన్… త్వరలో జిల్లా పర్యటనలు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు సాగించనున్నారు.
అయితే.. ఇప్పటి వరకు రాజన్న రాజ్యం స్తాపించామని.. ఐదేళ్లలో అమలు చేయాల్సిన హామీలను మూడేళ్లలోనే అమలు చేస్తున్నామని.. మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన.. జగన్ వాటిలో 90 శాతం హమీలను కూడా అమలు చేశామని అన్నారు. అంతేకాదు.. తమ పాలనకు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. మరి ప్రజలు ఇంతగా ఆనందంగా ఉంటే.. జగన్ ఏకంగా.. బుల్లెట్ ప్రూఫ్ బస్సులో యాత్రకు దిగడం ఏంటనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు.. ఖచ్చితంగా మూడేళ్ల కిందటే ఆయన పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అందరినీ కలిశారు. అప్పుడు లేని భయం ఇప్పుడు పట్టుకుందా? అనేది ప్రశ్న. అంటే.. తాను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే భయం.. ఎక్కడో సీఎంను వేధిస్తోందని అందుకే ఇంత `జాగ్రత్త` తీసుకుంటున్నారని పలువురు విపక్ష నాయకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates