ఇంటింటికీ వైసీపీ స‌రే.. ఎమ్మెల్యేల సంగ‌తేంది జ‌గ‌న‌న్నా?

“మ‌నంద‌రి ప్ర‌భుత్వం అంద‌రికీ న్యాయం చేస్తోంది. అసంతృప్తి ఎందుకు ఉంటుంది“ ఇదీ.. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ చెప్పేమాట‌. నిజ‌మే కావొచ్చు. ఎందుకంటే.. స‌ర్వం వలంటీర్ మ‌యం అయింది క‌నుక‌.. వారి సాధ‌క బాధ‌లు ఉన్నా.. ప్ర‌భుత్వానికి తెలిసే ప‌రిస్థితి లేదు. కానీ, ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న మాట‌. ఒక‌వేళ‌.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి దారుణంగా ఉన్నా.. ఎవ‌రూ ఫిర్యాదు చేసే వారు.. ఎవ‌రూ.. ఆయ‌న‌కు వేలు పెట్టి చూపించే వారు లేరు.

ఇదే.. జ‌గ‌న్‌కు ఇప్పుడున్న పెద్ద బ‌లం. ఆయ‌న ఏం చేసినా.. అడిగేవారు… లేరు. ఆయ‌న‌ను కాద‌ని అడుగులు వేసేవారు కూడా లేరు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతున్న జ‌రిగిన పాల‌నా ప్ర‌స్థానం ఇదే!  కానీ.. అన్న‌య్య స‌న్నిధి .. అదే మాకు పెన్నిధి.. అంటూ.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాగం తీసిన‌.. ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎంత దారుణంగా అంటున్నారు. పార్టీలో సీనియ‌ర్లు. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలో త‌మ‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నార‌ని.. తాము గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు వెలిసి.. గెలిపించామ‌ని.. ప్ర‌జ‌లు మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది.

దీనికికార‌ణం.. సీఎం జ‌గ‌న్ అనుస‌రించిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థే అనేది సీనియ‌ర్ల మాట‌. ఎంద‌కంటే.. ఎమ్మెల్యేకు.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉండాల్సిన సున్నిత‌మైన బంధాన్ని జ‌గ‌న్ వలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా.. తెంపేశారని అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న జ‌గ‌న్ మిన‌హా 150 మంది ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌లో నిల‌బెట్టి.. ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల గురించి కొంచెం వివ‌రించండి.. ప్లీజ్ అంటే.. పెద‌వి విప్పేవారు ప‌ట్టుమని.. పాతిక మంది కూడా లేర‌నేది వాస్త‌వం అంటున్నారు సీనియ‌ర్లు.

అంతేకాదు.. గ‌త ఏడాది స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంంలో కొంత తిరిగారు. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌ను వారు.. ప్ర‌జలు వారిని మ‌రిచిపోయారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే.. ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నేది వాస్త‌వం అంటున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తిప‌ధకాన్ని.. వలంటీర్ల‌తోనే జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు ఆయా ప‌థ‌కాల‌పై ప‌ట్టు చిక్క‌డం లేదు. ఒక‌ప్పుడు ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే గురుత‌ర బాధ్య‌త‌ను ఎమ్మెల్యేలు చూసేవారు.

దీంతో ఎమ్మెల్యేల‌కు.. ప్ర‌జ‌ల విష‌యంలో ఒక బాధ్య‌త‌.. ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేల ప‌ట్ల గౌర‌వం రెండు స‌మ‌పాళ్ల‌లో క‌నిపించాయి. కానీ, ఇప్పుడు అది లేదు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న కార్య‌క్రమాలు కూడా అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు.. ఎమ్మెల్యే కార్య‌క్ర‌మానికి వెళ్ల‌క‌పోతే.. త‌మ‌ను ప‌ట్టించుకోరేమోన‌నే బెంగ ప్ర‌జ‌ల్లో.. పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనూ ఉండేది. కానీ, ఇప్పుడు వారిలో ఆ త‌ర‌హా బెంగ క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు వ‌లంటీర్ల‌కు ఉన్న విలువ కూడా త‌మ‌కు లేకుండా పోయింద‌ని.. ఎమ్మెల్యేలు వాపోతున్నారు.  

ఈ నేప‌థ్యంలోనే.. త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌.. ఇంటింటికీ.. వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ఎలా ప్రారంభించాలి.. వెళ్లినా.. ఏం చెప్పాల‌నేది.. ఎమ్మెల్యేల ప్ర‌శ్న‌. పైగా.. ఒక్క సంక్షేమం గురించి తాము చెబితే.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు ప్ర‌స్తావిస్తే..వారికి తాము ఏం చెప్పాల‌నేది.. ఎమ్మెల్యేల‌కు ఆవేద‌న‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ఇంటింటికీ వైసీపీ ఆర్భాటంగా మిగిలిపోతుందా.. జ‌గ‌న్ అన‌నుకున్న విధంగా ఫ‌లితం ఇస్తుందా? అనేది ప్ర‌శ్న‌గా మారిపోయింది.