సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు ఇట్టే ప్రజల్లోకి వెళ్లటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుంటాయి. రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. అప్పటివరకూ ఎవరూ చూపించని కొత్తయాంగిల్ ను తన విమర్శల్లోనూ.. ఆరోపణల్లోనూ ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకించినోళ్లు చాలామందే ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం మిగిలిన …
Read More »భూమా అఖిల ప్రియ అరెస్టు తప్పదా?
రాజకీయాల్లో ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే. మంత్రిగా వ్యవహరించిన మహిళా నేత.. తన పదవి పోయిన తర్వాత సొంత పార్టీకి చెందిన నేత హత్యకు ప్లాన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొనటం బహుశా భూమా అఖిలప్రియే అవుతారేమో? రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళా నేతలు ఉన్నా.. హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన నేత ఒకరు ఆరోపణలు చేయటం.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం లాంటివి ఇప్పటివరకూ జరగలేదన్న మాట …
Read More »జగన్ సర్కారుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు?
ఇటీవల కాలంలో పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీ హైకోర్టులో ఎదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యుడిగా తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. దీనిపై న్యాయస్థానంలో జరిగిన పోరాటంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గతంలోనే చెప్పింది. …
Read More »కేసీఆర్ ఈసారి ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ..
కరోనా ప్రభావం ఓ మోస్తరు స్థాయిలో ఉన్నపుడు వారం పది రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో ధైర్యం నింపేవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పట్లో ఆయన వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తూ ఉండేవారు కూడా. కానీ ఈ మహమ్మారి తీవ్ర స్థాయికి చేరి తెలంగాణను వణికిస్తున్న సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం, ప్రెస్ మీట్ ఊసే లేకపోవడం, అసలు అధికారులతో కూడా టచ్‌లో లేకపోవడంపై …
Read More »కరోనా అంత్యక్రియలకు ప్యాకేజీ…ఏజెన్సీల నయా బిజినెస్
ప్రజల జీవితాలలో కరోనా కల్లోలం రేపింది. కరోనా మనందరికీ కొత్త జీవిత పాఠాలు నేర్పుతోంది. మానవత్వం కనుమరుగవుతున్న రోజుల్లో కొందరిలోనైనా అది మిగిలుందని నిరూపించే ఘటనలూ కరోనా కాలంలో చూశాం. ఇక, కరోనా భయంతో రక్తసంబంధీకులకు కడసారి వీడ్కోలు పలికేందుకూ ముందుకు రాని కర్కశ హృదయులను చూశాం. కరోనా ప్రభావంతో చాలా చోట్లు కట్టుబాట్లు మారాయి….పద్ధతులు మారాయి. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాలనూ పక్కనబెట్టి మరీ అంత్యక్రియల తంతును ముగించే పరిస్థితిని …
Read More »పవన్ ఫ్యాన్స్ ట్వీట్లు సరే.. మరి ఓట్లు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్లో 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఆరేళ్ల ముందు ట్విట్టర్లోకి అడుగు పెట్టగా.. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క సినిమా సంబంధిత ట్వీట్ కూడా వేయలేదు. ప్రధానంగా తన రాజకీయ ఉద్దేశాలు, విధానాలు చాటి చెప్పేందుకే ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆయనకు 40 లక్షలమంది ఫాలోవర్లున్నారు. సగం మందిని తీసి పక్కన పెట్టేసినా.. మిగతా సగం మంది ఆయన్ని వ్యక్తిగతంగా ఇష్టపడటంతో పాటు …
Read More »తెలంగాణ కరోనా బులిటెన్ మారిపోయింది
ఎన్ని విమర్శలు వచ్చినా, హైకోర్టు హెచ్చరికలు చేసినా.. కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి ఇష్టపడలేదు తెలంగాణ సర్కారు. కానీ ప్రజల్లో ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడం, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తీరు మారింది. ఏపీ తరహాలోనే ర్యాపిడ్ కిట్లు తెచ్చి కొన్ని రోజులుగా రోజుకు పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంపై, వసతుల లేమిపై సోషల్ …
Read More »ఏపీలో అంబులెన్సుల దుస్థితికిది నిదర్శనం
దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది జగన్ సర్కారు. అలాగే రికార్డు స్థాయిలో ఒకేసారి వెయ్యికి పైగా 104, 108 అంబులెన్సులను అందుబాటులోకి తేవడంపైనా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఐతే ఏపీలో కరోనా పరీక్షల వెనుక డొల్లతనం ఈ మధ్యే బయటికి వచ్చింది. సేకరించిన శాంపిల్స్‌పై పర్యవేక్షణ కొరవడటంతో ఏకంగా 2 లక్షలకు పైగా శాంపిల్స్ వృథా అయిన వైనం వెలుగులోకి వచ్చింది. …
Read More »కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్ని కొట్టేస్తున్నారట
కరోనా వ్యాక్సిన్.. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా దీని మీదే ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వేల మంది ప్రాణాలు బలిగొంటూ.. లక్షల మందిని అస్వస్థుల్ని చేస్తూ.. కోట్ల మందిని రోడ్డున పడేస్తూ.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నే కుప్పకూలుస్తున్న కరోనా మహమ్మారిన అదుపు చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధనలు జరుపుతున్నాయి. కరోనా పుట్టుకు కారణమైన చైనాతో పాటు ఆ వైరస్ వల్ల అత్యంత ప్రభావితం అయిన అమెరికా.. ఇంకా …
Read More »అంధుడిని బస్సెక్కించిన సుప్రియకు ఇల్లే గిప్టిచ్చిన యజమాని
చేసిన పాపం చెప్తే పోతుందిచేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుందిగుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా. ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని …
Read More »ఏపీలో అందరూ కరోనా బారిన పడే అవకాశం – సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలా నెమ్మదిగా ఉంది అనుకున్న కరోనా ఇటీవల వేగం పెంచింది. రెండు మూడు రోజులు రోజుకు రెండున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కరోనాపై మరోమారు స్పందించారు. రాబోయే రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. అయినా భయం వద్దని, సీరియస్ కేసుల …
Read More »ట్వీటు వీరులు…. ఈ పొలిటిషియన్లు
రాజుల కాలంలో ఒక ఊరి నుంచి మరొక సమాచారం చేరాలంటే పావురాలను ఆశ్రయించేవారు. కాల క్రమేణా సమాచార విప్లవం పుణ్యమా అంటూ ఇపుడు అరచేతిలో ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్ లో కావాలసినంత సమాచారం దొరుకుతోంది. ఇక, సమాచారం చేరవేయడానికి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు పోటీపడుతున్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన సమాచార మాధ్యమం ట్విట్టర్. రాజుల కాలం నుంచి స్ఫూర్తి పొందిన ట్విట్టర్ నిర్వాహకులు తమ సంస్థ …
Read More »