ఏపీ హైకోర్టులో మరోమారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అదే పార్టీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, …
Read More »ఎన్నాళ్లకెళ్లకు… బెంగళూరు ప్యాలెస్ లో జగన్ బస
నిజమే… ముచ్చటపడి కట్టుకున్న రాజప్రసాదం లాంటి భవంతిలో జగన్ అడుగు పెట్టి చాలా కాలమే అయ్యింది. చాలా కాలమే అంటే… ఏదో కొన్ని రోజులు అనుకునేరు. రోజులు కాదు మూడేళ్లకు పైగానే జగన్ అక్కడ అడుగుపెట్టింది లేదు. అయితే బుధవారం మొత్తం ఆయన సదరు భవంతిలోనే బస చేశారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకుండానే బుధవారమంతా జగన్ సదరు భవంతిలో విశ్రాంతి తీసుకున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి బెంగళూరు …
Read More »నేను ఆనాడు చెప్పిందే….ఆర్బీఐ ఈనాడు చెప్పింది
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…ఇప్పటివరకు ఈ పేరును సోషల్ మీడియాలో, మీడియాలో ఓ వర్గం…లైట్ తీసుకుంటుంది. ఇక, కొందరు నెటిజన్లయితే పప్పు అంటూ రాహుల్ ను ఎద్దేవా చేస్తుంటారు. ఇక, బీజేపీ అనుకూల మీడియా కూడా రాహుల్ సమర్థుడు కాదని చెప్పేందుక వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అందుకే, రాహుల్ గాంధీ అసలు ప్రధాని మోడీకి పోటీ కాదన్న భ్రమను మెజారిటీ ప్రజల్లో కల్పించడంలో ఆయా మీడియా సంస్థలు …
Read More »చిటికేసి సవాల్ చేసిన రఘురాముడు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి మాట్లాడితే.. అందరూ తన వైపు ఆసక్తిగా చూసేలా చేయగల నాయకుడు ఎవరు అంటే మరో మాట లేకుండా రఘురామకృష్ణం రాజు పేరు చెప్పేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువగా విరుచుకుపడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఆ పార్టీకే చెందిన ఈ ఎంపీ. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం నుంచి …
Read More »అడ్వైజర్లపై జగన్ సమీక్షలు షురూ… మూర్తి గారి బాటలో మరికొందరు?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… పలువురు జర్నలిస్టులు, ప్రత్యేకించి జగన్ కుటుంబ సారథ్యంలోని ‘సాక్షి’ మీడియాలో పనిచేసిన చాలా మందికి ఏపీ ప్రభుత్వంలో సలహాదారుల బాధ్యతలు దక్కాయి. వీరిలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో ఎవరు ఏ పని చేస్తున్నారు? వారికి జగన్ సర్కారు అప్పగించిన బాధ్యతలు ఏమిటి? అన్న …
Read More »రాహుల్ గాంధీనే కావాలి.. బీజేపీ డిమాండ్
వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది కాంగ్రెస్. అలాగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పలేదు. రోజు రోజుకూ ఆ పార్టీ ప్రాభవం తగ్గిపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకుంటుందన్న ఆశలేమీ కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ సమర్థతను చాటుకోలేకపోవడం. విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం, ప్రజాదరణ.. ఇలా ఏ కోణంలో చూసినా …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలన ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా …
Read More »రూ.2వేల నోటుపై కొత్త నిజాల్ని చెప్పిన ఆర్ బీఐ
ఆర్ బీఐ తాజా నివేదికను విడుదలైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాల్ని అందులో పేర్కొంది. తరచూ అందరి నోట నానే రూ.2వేల నోటుకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. అంతేకాదు..చెలామణిలో ఉన్న నోట్లతో పాటు.. పలు అంశాల్ని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయటం ఆపేసిందని వెల్లడించింది. వాస్తవానికి ఈ అంశంపై గతంలోనూ వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం ద్వారా …
Read More »కాంగ్రెస్ లో తుఫానుకు బీజం పడిందెక్కడో తెలుసా?
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో ఇప్పుడు పెను తుఫానే రేగింది. ఏళ్ల తరబడి గాంధీ కుటుంబం నేతృత్వంలోనే నడుస్తున్న ఈ పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఏకంగా 23 మంది అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ లేఖపై పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తగా… దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. అయితే సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ …
Read More »జగన్ సర్కారుకు మింగుడుపడని రీతిలో హైకోర్టు తాజా ఆదేశం
వైద్యుడిగా సుపరిచితుడు.. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమానుల్లో ఒకరుగా పేరున్న డాక్టర్ రమేశ్ పై ఏపీ సర్కారు చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మరణించటం.. దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలు కావటం తలెిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకున్న …
Read More »రాజధానిగా అమరావతి అవసరం లేదన్న కొడాలి నాని
ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా.. తన ప్రాంతానికి సంబంధించి ఏదైనా మేలు జరుగుతుందంటే.. వకల్తా పుచ్చుకోవటానికి ముందుంటారు అందుకు భిన్నంగా.. తన ప్రాంతానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటే.. దానికి నో చెప్పేస్తాడు. పార్టీ లైన్ కు లోబడి ఉండాల్సి వస్తే.. మౌనంగా ఉంటారు. ఇలాంటి రూల్స్ మొత్తానికి భిన్నంగా ఏపీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఆయన …
Read More »అన్ని పత్రికలు కలిసి సాక్షికి సరితూగలేదు
సాధారణంగా పత్రికలకు ఉన్న సర్క్యులేషన్ ను బట్టి ప్రభుత్వం ప్రకటనలిస్తుంటుంది. ఇక, ఆయా పత్రికల సర్క్యులేషన్ తో పాటు పాపులారిటీని బట్టి, డీలింగ్స్ ను బట్టి పలు ప్రైవేటు సంస్థలు, కార్పొరేటు కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. వీటిలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలకు సమానంగా ఇవ్వాలి. అయితే, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల శాతం…మిగతా పత్రికల కన్నా కొంచెం ఎక్కువగా …
Read More »