Political News

మరో రెండ్రోజుల్లో నాపై దాడి జరగొచ్చు: రఘురామ

కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కూడా కోరారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, రఘురామ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు …

Read More »

విశాఖ విచిత్రం – రామురామంటున్నారు ఆ ఇద్దరు !

వినటానికి విచిత్రంగానే ఉన్న పార్టీలోనే ఈ చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద టిడిపి గెలిచింది వైజాగ్ నగరంలో మాత్రమే. నగరంలోని నాలుగు సీట్లనూ తెలుగుదేశంపార్టీ గెలిచింది. అంటే నగరంలో పట్టున్నట్లు తమ్ముళ్ళు నిరూపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాత రాజకీయంగా టిడిపిలో చాలా మార్పులొచ్చేశాయి. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా పార్టీ నేతల్లో చీలిక …

Read More »

తిరుప‌తిలో ఇలా చేద్దాం.. చంద్ర‌బాబు అదిరిపోయే ఐడియా!

రాష్ట్రంలో ఉప ఎన్నిక‌కు అవ‌కాశం ఉన్న తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది? ఏ నిర్ణ‌యం తీసుకుంటుంది? ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంది? అనే విష‌యాలు ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రి పోరు సాగించాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఈ సీటును సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి ఇచ్చారు చంద్ర‌బాబు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇక‌.. ఇప్పుడు ఏం చేయాలి? …

Read More »

పొలిటిక‌ల్ పోరులో జ‌న‌సేన వెనుక‌బ‌డిందా?

పొలిటిక‌ల్ మీట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన వెనుక‌బ‌డిందా? గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇత‌ర ప‌క్షాలు ప్ర‌య‌త్నించిన రీతిలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌లేదా? పైగా మిత్ర ప‌క్షం బీజేపీతోనూ ఆయ‌న క‌లివిడిగా ఉండ‌లేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లను టీడీపీ, బీజేపీలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. …

Read More »

సంకేతాలు వ‌చ్చేశాయ్‌.. మాగంటి లైన్ క్లియ‌ర్‌ ?

ఏలూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌గా చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, విస్తృత ప‌రిచ‌యాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయ‌న సైకిల్ దిగుతున్నార‌నే ప్ర‌చారం ఇటీవ‌ల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివ‌న్నీ.. బూట‌క‌మ‌ని, వెబ్ మీడియాకు ప‌నీపాటా లేకుండా రాత‌లు రాస్తోంద‌ని ఈస‌డించుకున్న టీడీపీలోని ఓ వ‌ర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాల‌తో షాక్‌కు గుర‌వుతోంది. అజాత శ‌తృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి …

Read More »

చంద్రబాబు అడుగుజాడల్లో జగన్ .. గుణపాఠం నేర్చుకోలేదా ?

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు చేసిన దానికి జగన్ ఇపుడు చేస్తున్న దానికి కాస్త తేడా ఉన్నా మొత్తం మీద రిజల్టయితే ఒకటే. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. అదేనండి టిడిపి నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయం గురించే ఇదంతా. నిజానికి టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఎంతమాత్రం లేదనే …

Read More »

మేం టీఆర్ఎస్ లా కాదు…హరీశ్ కు బాలినేని కౌంటర్

కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విద్యుత్ సంస్కరణలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉండగా తెలంగాణతోపాటు మరి కొన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయి. ఆ సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకుగాను స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన …

Read More »

బీజేపీది బ‌లుపా? వాపా?

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నంలో ఒక అడుగు ముందుకు ప‌డిందా? ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. మాట్లాడ‌డం లేదు.. ఎవ‌రికి వారే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డిందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. సోము వీర్రాజు పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డం, …

Read More »

‘జగన్ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకుంటున్నాడు’

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు. కింజారపు …

Read More »

పార్టీ నేతలకు భారీ టార్గెట్ ఇచ్చేసిన కేటీఆర్

దేశమంతా కరోనా ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ రచ్చ భారీగా నడుస్తున్న వేళ.. తెలంగాణలో అదనంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలతో పాటు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చే ఎన్నికలన్నింటిలోనూ విజయం తమ సొంతమయ్యేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. పట్టభద్రుల ఎన్నికలు గతానికి మించి పోటాపోటీగా …

Read More »

రాబోయే రోజుల్లో రచ్చ ఎంతో చెప్పేసిన ట్రంప్

తొలిసారి అమెరికన్లు రచ్చ రాజకీయాల్ని చూడబోతున్నారా? లోపల ఎలా చచ్చినా పైకి మాత్రం హుందాగా తమ రాజకీయాలు ఉన్నట్లుగా కలరింగ్ ఇవ్వటం మామూలే. కాకుంటే.. మనకు మాదిరి పోలింగ్ బూతుల్ని స్వాధీనం చేసుకోవటం.. తుపాకులతో హల్ చల్ చేయటం.. రక్తం వచ్చేట్లు కొట్టుకోవటం.. కత్తులతో స్వైర విహారం చేయటం.. బాంబులు విసురుకోవటం లాంటివి చూడం. కానీ.. ఈసారి అలాంటివి కాకుండా.. కొత్త తరహా రచ్చలకు కేరాఫ్ అడ్రస్ గా అమెరికా …

Read More »

తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రతను బట్టి బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ త్వరలోనే బార్లను బార్లా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. …

Read More »