ఏపీలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో పందేలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాస్తవానికిఇ క్కడ పోలీసులు కోడి పందేలపై నెలరోజులుగా నిఘా పెట్టారు. పందేలు వేయడానికి వీల్లేదని చెప్పారు. చాలా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే.. పోలీసులను మచ్చిక చేసుకున్న నేతలు.. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి పందేలకు రెడీ అయ్యారు.
అయినప్పటికీ.. ఉమ్మడి తూర్పుగోదావరిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా ఒక చోట జరిగిన ఘటనలో ఏకంగా పోలీసు అధికారిపైనే వైసీపీ ఎమ్మెల్యే జులుం ప్రదర్శించడం.. చర్చకు దారితీసింది. కోడి పందాలు వద్దు అన్నందుకు పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే దాడి కి యత్నించారు. అంతేకాదు.. ఎన్ని కేసులు అయిన పోట్టుకో పో అంటూ ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా(ప్రస్తుతం కోనసీమ)లోని రావుల పాలెంలో వైసీపీ నేత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోడి పందేలకు బరులు రెడీ చేశారు.
అయితే.. రావులపాలెం పోలీసులు బరులను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలోనే రావులపాలెం శివారు ప్రాంతంలో వేసిన బరిలోనూ చర్యలు తీసుకునేందుకు వచ్చారు. ఎస్సై సురేంద్ర వచ్చీరావడంతో అక్కడే ఉన్న కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీకేం పనం
టూ మండిపడ్డారు. అంతేకాదు.. బరులు వేసింది ప్రయివేటు స్థలమని, సంక్రాంతి రోజు కూడా ప్రజలను బతకనివ్వరా? అని వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసులుంటే తనపై పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎస్సై భుజంపై చేయి వేసి.. అక్కడ నుంచి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.