దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిది. ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం.. తాజాగా …
Read More »జగన్ సర్కారులో రెడ్డి గారి సతీమణి హవా ఇంత నడిచిందా?
చేతిలో అంతులేని అధికారం ఉన్న వేళ.. దాన్ని జాగ్రత్తగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సొంత అవసరాల కోసం వాడేస్తే.. ఆ తర్వాత ఏదో రోజు అదో తలనొప్పిగా మారటంఖాయం. ఇప్పుడు ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి విషయంలో అలాంటిదే చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వంలో తిరుగులేని పవర్ ను ప్రదర్శించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన సతీమణి అపర్ణ హవా …
Read More »రేవంత్ రెడ్డి ‘ఆపరేషన్’… బీఆర్ఎస్ పరేషాన్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా.. అంటూ కొన్ని రోజుల కిందట ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన తన పార్టీ లో చేర్చుకున్నారు. అయితే.. ఇలా చేర్చుకోవడంపై విమర్శల మాట ఎలా ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి మాత్రం సూటి పోటి మాటలు ఎదురవుతూనే …
Read More »ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన పరిణామాలు!
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కలకలం రేపిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశానికి దాదాపు తెరపడింది. గత రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటులోనూ మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామని చెప్పారు. దీనిపై అప్పట్లో వైసీపీ సర్కారు లేఖలు రాసి సరిపుచ్చింది. ప్రైవేటీకరణ చేయొద్దని అప్పటి సీఎం …
Read More »వల్లభనేని వంశీ మిస్సింగ్.. ఏం జరిగింది?
వల్లభనేని వంశీ. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అసెంబ్లీలోను, బయటా.. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. 2019లో టీడీపీ తరఫున కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరి ఆ పార్టీ నాయకులతో కలిసి.. …
Read More »ఢిల్లీలోనే బుగ్గన.. జగన్‌కు బెంగేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలా పడ్డ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తప్పడం లేదనే చెప్పాలి. ఎన్నికల్లో ఘోరా పరాజయం కారణంగా వైసీపీని వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఇప్పుడు మరికొంతమంది నాయకులు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీనీ వీడబోతున్నారనే …
Read More »ప్రొఫెసర్‌గా లక్ష్మీపార్వతి.. అదే జగన్ మాయ!
పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు గైడ్‌గా ఉండాలంటే సబ్జెక్టుపై లోతైన అవగాహన, ఎంతో అనుభవం ఉండాలి. అందుకు సరైన అర్హతలు ఉండాలి. కానీ అవేమీ లేకున్నా సరే జగన్ అండ ఉంటే చాలు ఏ పదవి అయినా పట్టేయొచ్చు అనేందుకు ఇది మరో రుజువు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కటాక్షం కోసం అధికారులు ఏం చేయాలో అంతా చేశారు. ఆ క్రమంలోనే వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతిని ఏయూ తెలుగు …
Read More »మాజీ మంత్రి వర్సెస్ మహిళా ఎమ్మెల్యే.. కోర్టులో కేసు
అధికారం ఉందనే అహంకారంతో జగన్ అండ్ కో చేసిన అరాచకాలకు జనం ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పాతాళానికి తొక్కారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు కూడా రెచ్చిపోయారు. ప్రత్యర్థి పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు కలుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి సీదరి అప్పలరాజును వదిలేదే …
Read More »యాక్షన్-రియాక్షన్: వైసీపీపై సొంత నేత ఓ రేంజ్‌లో!!
యాక్షన్‌కు రియాక్షన్ వచ్చింది. అధికారం కోల్పోయిన వైసీపీపై సొంత నేతలు తిరగబడుతున్నారు. తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ అధినేత జగన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఈ దఫా టికెట్ ఇవ్వలేదు. అయితే.. ప్రత్యర్థి పార్టీలతో అంటకాగుతూ.. సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో సిద్దారెడ్డి తాజాగా రియాక్షన్‌కు …
Read More »మోడీ దగ్గర జగన్ అప్పుల చిట్టా పెట్టా: చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అప్పుల అప్పారావుగా మారిన జగన్ అందిన కాడికి ఇటు బ్యాంకు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్న వ్యవహారంపై కాగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు…జగన్ చేసిన అప్పులపై కీలక …
Read More »టీడీపీలో పదవుల రగడ.. ఏం జరుగుతోందంటే..!
ఉత్తరాంధ్ర టిడిపిలో పదవుల కలకలం రేగింది. కీలకమైన నాయకులకు సీఎం చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, పదవి ఇస్తారని ఆయన వర్గం ఆశించింది. కానీ అట్లాంటిదేమి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా …
Read More »మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ నిజమేనా ?!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ టికెట్ దక్కించుకుని రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 2014లో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తనకు మల్లారెడ్డి అడ్డురావడంతో …
Read More »