Political News

జ‌గ‌న్‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!!

రాష్ట్రంలో వైసిపి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం చవిచూసిన విషయం తెలిసిందే. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. దీంతో అసెంబ్లీలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా.. ఎలాంటి బిల్లులు తీసుకువచ్చినా వైసిపి తరఫున మాట్లాడే నాయకుడు, నిలదీసే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. ఒకవేళ నిలదీసినా అధికార పార్టీ మైకు ఇవ్వ‌దు. సలహాలు కూడా పాటించే పరిస్థితి …

Read More »

త‌ల‌సాని కాంగ్రెస్‌లోకి.. హైద‌రాబాద్ టార్గెట్‌గా రేవంత్‌!

హైద‌రాబాద్ తెలంగాణ‌కు గుండెలాంటిది. వ్యాపార‌, వాణిజ్య‌, రాజ‌కీయ‌, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైద‌రాబాద్ ఎంతో కీల‌క‌మైంది. పొలిటిక‌ల్ ప‌రంగానూ హైద‌రాబాద్‌కు ఎన‌లేని ప్రాధాన్య‌త ఉంది. కానీ గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క‌టి కూడా గెలుచుకోలేక‌పోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుంటూ హైద‌రాబాద్‌పై ప‌ట్టుకు సీఎం రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఏ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అయితే కాంగ్రెస్ …

Read More »

జ‌గ‌న్‌.. ‘ఇస్కాన్‌’ను కూడా వేధించారా? వెలుగులోకి సంచ‌ల‌నం

వైసీపీ హ‌యాంలో రాజ‌కీయ వేధింపులు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నాయకుల అరెస్టులు, అధినేత‌ల ను జైల్లో పెట్టిన వ్య‌వ‌హారం కూడా అంద‌రికీ తెలిసిందే. ఇక‌, భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను కూడా ప్ర‌భుత్వం హ‌రించింద‌నే వాద‌న వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. చీమ‌కు సైతం హాని త‌ల‌పెట్ట‌ని హ‌రేకృష్ణ సేవా స‌మితిని కూడా వైసీపీ ప్ర‌భుత్వం వేధించింద‌ట‌. 2014-19 మధ్య అనంత‌పురం ప్రాంతంలోని పెనుగొండ‌లో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలోని …

Read More »

జగన్‌‌ను మెప్పించి.. గట్టిగా ఇరుక్కున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా 151 సీట్లతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతోొ ఇక వైసీపీకి తిరుగులేదని.. టీడీపీ, జనసేన ఇక లేవలేవని.. ఇంకోసారి కూడా జగన్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధీమా ఆ పార్టీ వర్గాల్లోనే కాక జగన్ అండ్ కోకు మద్దతుగా నిలిచే అధికారుల్లోనూ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు జగన్ సర్కారుకు తొత్తుల్లా మారిపోయి …

Read More »

ఉప ఎన్నిక‌ల్లో మోడీకి తొలి దెబ్బ‌.

దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మికి తొలి దెబ్బ భారీగా త‌గులుతోంది. అధికారం చేప‌ట్టిన నెల రోజుల్లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు, ముఖ్యంగా బీజేపీ ఉప పోరులో వెనుక‌బ‌డి పోగా.. ఇండియా కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శించింది. మొత్తం 13 స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. శ‌నివారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్టారు. 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి …

Read More »

‘నా భార్య గర్భానికి విజయసాయి రెడ్డి కారణం’

ఏపీలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ‘నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని, నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే భర్త మదన్ మోహన్ ఫిర్యాదులో అనుమానానం వ్యక్తం చేశాడు. నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో …

Read More »

హ‌రీష్ రావు ఆలోచ‌న‌ల్లో బీజేపీ.. ఈట‌ల చెప్పిందేంటీ?

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించిన బీఆర్ఎస్‌కు ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌డం లేదు. గతేడాది ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆ పార్టీ మ‌నుగ‌డే ప్ర‌మాదంలో ప‌డింది. ఇక ఈ ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్లు రావ‌డం కేసీఆర్‌కు దారుణ అవ‌మానాన్ని మిగిల్చింది. మునిగిపోయే పడ‌వ లాంటి బీఆర్ఎస్‌లో ఉండ‌లేక చాలా మంది నాయ‌కులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. కొంత‌మంది బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో …

Read More »

షర్మిల గాలానికి వైసీపీ నేతలు చిక్కుతారా ?!

అన్న మీద తిరుగుబాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఓటమికి తీవ్రంగా కృషిచేసిన వైఎస్ జగన్ సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. అయితే ఎన్నికల్లో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆమె దూకుడుగా వెళ్తుండడం గమనార్హం. వైఎస్ జయంతి …

Read More »

కాళ్ల‌కు ద‌ణ్ణాలొద్దు.. :చంద్ర‌బాబు హిత‌వు

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మంత్రుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశా రు. గుంటూరులోని కొల‌నుకొండ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు.. అనంత‌రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌లను చంద్ర‌బాబు ప‌ల‌కించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారి నుంచి విన‌తి ప‌త్రాలు స్వీక‌రించారు. అయితే.. చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి చేరుకోగానే.. …

Read More »

బీఆర్ఎస్ స‌గం ఖాళీ.. తాజాగా గాంధీ కూడా!

Arekapudi Gandhi

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ నుంచి దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఖాళీ అవుతున్నా రు. ఇప్ప‌టికే ప‌ది మంది బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌గా.. వారిని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆద్వ‌ర్యంలో వారిని పార్టీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రో ఐదుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక‌, ఎమ్మెల్సీలు …

Read More »

చంద్రబాబుది పెద్ద ప్లానే !

ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వానికి వెన్నెముకలా మారాడు. ఈ నేఫథ్యంలో ఈ ఐదేళ్లలో కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు, ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పరిశ్రమలు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రానికి అనేక వినతులు వెళ్లడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ …

Read More »

నన్ను ఇన్ వాల్వ్ చేయకండి జగన్ గారు !

వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు ఏపీలో ఐదేళ్లు 151 శాసనసభ్యులు, 21 ఎంపీలతో చక్రం తిప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు పరిమితమై చతికిలపడింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరి కొంతమంది అసలు ఎక్కడు ఉన్నారో …

Read More »