జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం అంటూ లేకుండా పోయిందా? ముఖ్యంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న పెండెం దొరబాబు.. నేరుగా జనసేనలోనే చేరిపోయారు. ఇది వైసీపీని ఏమీ చేయదని మొదట్లో అనుకున్నా.. ఆయన వర్గం, ఆయన అనుచరులు ఇప్పుడు గుండుగుత్తగా.. జనసేన వైపే ఉన్నారు. …
Read More »సినిమా డైలాగులతో రాజకీయాలు చేయలేరు
రాజకీయాల్లో ఓర్పు.. నేర్పు చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రత్యర్థులు పన్నే వలకు చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా నాయకులకు ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా .. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి.. ప్రత్యర్థి బుట్టలో పడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా.. ఎవరు అధికారంలో ఉంటే.. వారు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం అనేది కామన్. ఇది దేశవ్యా ప్తంగా అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలో …
Read More »చంద్రబాబూ మీరు విజ్ఞులు.. ఇలా చేయొచ్చా?: సీఎం రేవంత్
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా పాల మూరులో కీలకమైన ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా అడ్డుకోవడం ధర్మం కాదన్నారు. “చంద్రబాబూ మీరు విజ్ఞులు.. ఇలాచేయొచ్చా?“ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో చంద్రబాబు ప్రారంభించిన కల్వకుర్తి ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్నికూడా లేవనెత్తారు. …
Read More »పార్లమెంటులో బనకచర్లపై గళం: చంద్రబాబు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. సహా ఇతర పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేవారు. కేంద్రం నుంచి రావాల్సిన …
Read More »‘2034 వరకు పాలమూరు బిడ్డే సీఎం’
తెలంగాణ ముఖ్యమంత్రిగా 2034 వరకు పాలమూరు బిడ్డే ఉంటాడని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు నుంచి ఎన్నికైన కేసీఆర్.. ఈ గడ్డకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ అధినేతను ఆయన నిలదీశారు. కరీంనగర్ నుంచి వచ్చి.. పాలమూరు నుంచి నిలబడితే..ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నారని..కానీ, ఆయన ఇక్కడి వారిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. పాలమూరులో శ్రీశైలం ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. వారికి …
Read More »చెప్పి ఒప్పిద్దాం.. అమరావతిపై బాబు డెసిషన్
ఏపీ రాజధాని అమరావతిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. నిన్న మొన్నటి వరకు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్‌కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ సహా.. అనేక రంగాలకు.. అమరావతిని హబ్‌గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం. ఈ క్రమంలోనే.. ఇప్పటికే తీసుకున్న 34 వేల ఎకరాలకు అనుబంధంగా మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు(పూలింగ్) సిద్ధమయ్యారు. …
Read More »తమ్ముళ్లు దారి తప్పుతప్పున్నారు.. బాబు సర్!
ఒక పార్టీలో ఏ ఒక్క నేత దారి తప్పినా.. అది పార్టీకి, ఆ పార్టీ అధినేత మెడకు చుట్టుకుంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీనే. రప్పా.. రప్పా.. అంటూ.. కార్యకర్తలు హోర్డింగులు ఏర్పాటు చేశారు. కానీ, విమర్శలు మాత్రం జగన్ కే వచ్చాయి. అయితే.. దౌర్భాగ్యం ఏంటంటే.. వాటిని ఆయన కూడా సమర్ధించుకున్నారు. ఇక, చేసేది ఏముంది..? జగన్ కూడా రప్పా రప్పా బ్యాచ్‌లో చేరిపోయారు. అంతో ఇంతో ఉన్న …
Read More »కేసీఆర్ జగన్‌తో కలిసిస్తే తప్పు లేదు కానీ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకు డు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) సహా ఇతర నదీ జలాల విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా …
Read More »ఈటల వర్సెస్ సంజయ్.. పొలిటికల్ హీట్!
తెలంగాణ బీజేపీలో వర్గ పోరు ఎక్కువగా కనిపిస్తోంది. గ్రూపు రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు, పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజా సింగ్ వెల్లడించారు. పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే… పార్టీ అదిష్టానం దీనిపై ఏమేరకు దృష్టి పెట్టిందో తెలియదు కానీ.. వర్గ పోరు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. నాయకులు ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. …
Read More »లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి రోల్ ఇదీ.. !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో లిక్కర్ ఆ పార్టీ నాయకులకు ఒక ఆదాయ వనరు!. ఈ మాట చెప్పింది… ప్రత్యర్థులు కాదు.. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. అందుకే.. ఈ కేసులో ఇప్పటికి 44 మందిని విచారించారు. వీరిలోనూ కీలకమైన మాజీ ఐఏఎస్ అదికారులు కూడా ఉన్నారు. అలానే.. వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. సో.. …
Read More »చంద్రబాబు వల్లే ఇన్ని పదవులు: అశోక్
తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వేర్వేరుగా ఆయన రాజీనామా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా తన రాజకీయం ఎలా ఎక్కడ నుంచి ప్రారంభమైందన్న విషయాన్ని గజపతిరాజు వివరించారు. ఎన్టీఆర్ పిలుపుతో తాను ప్రజాసేవ చేసేందుకు .. రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ …
Read More »మిథున్ రెడ్డికి సుప్రీం షాక్.. ఇక, జైలే!
వైసీపీ రాజంపేట ఎంపీ.. పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డిని మాస్టర్ మైండ్‌గా పేర్కొంటూ.. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు వ్యవహారంపై మిథున్‌రెడ్డి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. ఇక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అసలు ఈ కేసులో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates