ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో అభ్యర్థులలో హర్షం వ్యక్తం అవుతోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించారు. అతి తక్కువ సమయంలోనే కోర్టు కేసులను అధిగమించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. గత డీఎస్సీ ఒక రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఏటా డీఎస్సీ వేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది కూడా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి టెట్ నిర్వహించారు.
ఈరోజు అసెంబ్లీలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ఏడాది జరిగిన డీఎస్సీలో కూడా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాం అన్నారు. అయినా ఇప్పటికీ టీచర్ – స్టూడెంట్ రేషియో అక్కడ తక్కువగా ఉందన్నారు.
త్వరలో మరో డీఎస్సీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అందులో కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం అన్నారు. దీన్నిబట్టి ఈసారి కర్నూలు అభ్యర్థులపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఉగాదికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3600 డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత సిలబస్ ప్రకారమే అంటే గతేడాది డీఎస్సీకి ఇచ్చిన సిలబస్, మార్గదర్శకాలనే ఈసారీ అమలు చేయనున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates