మూడు రాజధానులు – మూడు బహిరంగ సభలు

రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధానిగా చంద్రబాబునాయుడు అండ్ కో కీలకమైన ఎజెండాగా చేసుకునే అవకాశముంది. ఇలాంటి నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానులే తమ ఎజెండాగా ఎన్నికల నినాదం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే తొందరలో మూడు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలును జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇపుడు అసెంబ్లీ ఉన్న అమరావతే శాసన రాజధానిగా కంటిన్యూ అవుతుందని జగన్ ప్రకటించారు. దీన్ని ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వ్యతిరేకతను ప్రదర్శించటంలో భాగంగా అమరావతి రైతులు పాదయాత్ర కూడా చేస్తున్నాయి.

సరిగ్గా దీనికి కౌంటరుగా అన్నట్లు తొందరలోనే అంటే వైజాగ్, కర్నూలు, విజయవాడల్లో భారీ బహిరంగసభలు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయ్యారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎందకు ఎంపికచేసినట్లు ? దానివల్ల జరిగే నష్టాలేమిటి ? అనేది తన కోణంలో జగన్ చెప్పబోతున్నారట. ఇదే సమయంలో తాను మూడు రాజధానుల కాన్సెప్టును ఎందుకు తీసుకొచ్చినట్లు ? తన కాన్సెప్టువల్ల రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు ఎలాగ అభివృద్ధి జరుగుతుందనే విషయాలను వివరించబోతున్నారట.

రాజధాని ఏర్పాటుకు సంబందించి గతంలో శివరామకృష్ణన్ కమిటి ఏమి చెప్పింది? అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ చెప్పిందేమిటి అనే విషయాలను కూడా జనాలకు వివరించబోతున్నారు. మొత్తానికి జగన్ నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగసభల్లో వైజాగ్, కర్నూలు జనాలకు బాగా కనెక్టవుతామనే నమ్మకంతో ఉన్నారు జగన్.

అయితే గతంలో అమరావతి పాదయాత్ర జరిగినపుడు తిరుపతిలో పెట్టిన మూడు రాజధానుల సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి ఇపుడు జగన్ పెట్టే సభలు విజయవంతం అవుతాయా? చూడాలి ఏం జరుగుతుందో.