అవును.. వైసీపీలో కీలక నాయకుడు.. సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు.. ఒకరు.. తలపట్టుకున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన తీవ్రంగా మధన పడుతున్నారట. ఇంతకీ ఏం జరిగిం దంటే.. ఉత్తరాంధ్రలోని కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతను సదరు నాయకుడికి.. సీఎం జగన్ అప్పగించారు. అంతేకాదు.. త్వరలోనే జరగనున్న.. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యతనుకూడా మోపారట.
దీంతో సదరు నాయకుడు.. జిల్లాలోనే మకాం.. వేసి మరీ.. పార్టీ నాయకులను కలుస్తున్నారు. క్షేత్రస్థాయి లో గ్రామం నుంచి మండలం వరకు నాయకులను కలుస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరు నిలబడ్డా.. కూడా వారిని గెలిపించాలని.. నిర్దేశిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా నాయకులు.. సదరు కీలక నేత ముందు.. డిమాండ్ల చిట్టా పెడుతున్నారట. అంతేకాదు.. అసలు పార్టీ పరిస్థితి ఉత్తరాంధ్ర లోను.. మరీ ముఖ్యంగా.. విశాఖ జిల్లాలోనూ ఇబ్బందిగా ఉందని చెబుతున్నారట.
ఎక్కడికక్కడ.. ప్రజలు నాయకులకు మధ్యసయోధ్య లేదని.. నాయకులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో ఉన్న హవా కూడా ఇప్పుడు లేదని.. నిజానికి ప్రత్యర్థి పార్టీలకు కంచుకోటల వంటి ఈ జిల్లాల్లో పాగా వేసినా.. దానిని కాపాడుకోవడం.. నిలబెట్టుకోవడం విషయంలో కీలక నేతలు విఫలమ వుతున్నారని.. చాలా మంది నాయకులు తేల్చి చెప్పారట. మరికొందరు తాము ఎన్నోఏళ్లుగా పనిచేస్తు న్నామని.. గత ఎన్నికల్లో చాలానేడబ్బులు ఖర్చు చేశామని.. అయినా కూడా.. తమకు ప్రాధాన్యం లేదని.. చెబుతున్నారట.
దీంతో ఇన్ని సమస్యలు పెట్టుకుని.. సొంత పార్టీలోనే నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం సాధ్యమేనా? అనేది .. సదరు సీనియర్ నేత అంతర్మథనం. దీంతో ఆయన ఈ బాధ్యత తన వల్లకాదని..వేరే వారికి అప్పగించాలని.. అధిష్టానం ముందు ఏకరువు పెట్టారట. లేకపోతే.. స్థానికంగా ఉన్న నాయకుల డిమాండ్లను అయినా.. పరిష్కరించాలని..ఆయన సూచించారట. ఈ పరిణామాలతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక గరంగరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates