వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న జనసేన పార్టీ.. ఆదిశగా అడుగులు వేగంగా వేస్తోంది. త్వరలోనే జిల్లా స్తాయిలో సమీక్షలు చేస్తానని.. స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పైగా.. తన బస్సు యాత్రను కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ పరిణామాలతో.. జనసేనలో ఉత్సాహం పెరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ఒకవైపు పార్టీని గెలిపించడంతోపాటు.. తరచుగా.. తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయకులకు చెక్ పెట్టాలని కూడా.. పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా.. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పవన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారని.. అంటున్నారు జనసేన నాయకులు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్నాజిల్లాలోని.. మూడు నియోజకవర్గాలను టార్గెట్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం, మచిలీపట్నం.. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గాలపై పట్టు పెంచుకుని,, గెలుపు గుర్రం ఎక్కాలని.. ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని.. అంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల నుంచి విజయం దక్కించుకున్నవారు.. జగన్ తొలి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు.
గుడివాడ నుంచి కొడాలి నాని, మచిలీపట్నం నుంచి పేర్ని నాని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు.. జగన్ ఫస్ట్ కేబినెట్‌లో పనిచేశారు. తర్వాత.. రెండోసారి.. వారికి ఛాన్స్ దక్కలేదు. అయితే.. మంత్రులుగా ఉన్న సమయంలో పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తర్వాత. మంత్రి పదవులు లేకపోయినా వారు రెచ్చిపోయారు. ప్రస్తుతం మంత్రులుగా లేకపోయినా.. వారి దూకుడు ఎక్కడా తగ్గలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి చెక్ పెట్టాలని. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏంటని..పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇక.. ఈ మూడు నియోజకవర్గాల పరంగా జనసేన బలం చూస్తే. విజయవాడ పశ్చిమలో జనసేనకు మిశ్రమ స్పందన ఉంది. ఇక్కడ మాజీ మంత్రి వెల్లంపల్లికి వ్యతిరేకంగా.. పరిస్థితి మారిపోయింది. అదేసమయంలో ఆయన జనసేన నేత.. పోతిన మహేష్ పుంజుకుంటున్నారు. దీంతో ఇక్కడ అవకాశం ఉంది. ఇక, మచిలీపట్నంలో.. జనసేన దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. కాపు ఓట్లను సమీకరించగలిగితే.. ఇక్కడ గెలుపు పెద్ద కష్టం కాదు. అయితే..ఎటొచ్చీ.. గుడివాడలో కమ్మల ఓట్లు పడడమే ఇబ్బంది. అయితే..ఇక్కడ యూత్‌ను మెగా అభిమానులను సమీకరిస్తే.. జనసేనాని వ్యూహం ఫలిస్తుందనే అంచనాలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates