కేటీఆర్ త‌డ‌బాటు.. నెటిజ‌న్లు.. క్లాస్ పీకేశారుగా!

అత్యంత ఇంపార్టెంట్‌గా ముందుకు సాగుతున్న తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌.. అధికార పార్టీకి ప్రాణ‌సంక‌టంగా మారింది. ఇక్క‌డ గెలిచి తీరాల్సిన అవ‌స‌రం.. గెలుపుగుర్రం ఎక్కాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని.. తెలిసిందే. అయితే.. అధికార పార్టీ త‌ర‌ఫున జ‌రుగుతున్న చిన్న చిన్న త‌ప్పిదాలు.. పార్టీ ని ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. తాజాగా మంత్రి, రాజ‌కీయంగా.. ఏవిష‌యాన్న‌యినా.. స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేయ‌గ‌ల నాయ‌కుడుగా పేరున్న‌.. కేటీఆర్ త‌డ‌బ‌డ్డారు.

మునుగోడులో ఈ రోజు .. తొలిసారి ప‌ర్య‌టించిన‌..ఆయ‌న పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినే ష‌న్ ఘ‌ట్టంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. మునుగోడును గెలిపిస్తే.. అభివృద్ధి చేసే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. జ‌నాలు భారీగా వ‌చ్చార‌నే సంతోషంలోనో..లేక‌.. త‌న‌పై మ‌రింత విశ్వ‌స‌నీ య‌త‌ను పెంచాల‌ని అనుకున్నారో.. తెలియ‌దు కానీ.. త‌డ‌బ‌డ్డారు.

త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిశిల్ల నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌హాలో మునుగోడుపై స‌మీక్ష‌లు చేస్తాన‌ని.. అభి వృద్ధిని ప‌రుగులు పెట్టిస్తాన‌ని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న అలా అన్నారో లేదో..ఇ లా నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

‘మీ పార్టీ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్ర‌మేఅభివృద్ధి చేస్తారా?’ అని కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు.. ‘మునుగోడు అభివృద్ది అందుకే నిలిచిపోయిందా?’ అని పెద‌వి విరిచిన వారు మ‌రికొంద‌రు. “మీరు ఒక్క స‌రిసిల్ల‌కు మాత్ర‌మే మంత్రికాదు కేటీఆర్ స‌ర్‌.. రాష్ట్రం మొత్తానికి మంత్రి” అని వ్యాఖ్యానించిన వారు ఇంకొంద‌రు ఉన్నారు. “మంత్రిగా ఆలోచించండి స‌ర్‌.. కేవ‌లం పార్టీ కార్య‌క‌ర్త‌గా కాదు.. ” అని మ‌రికొంద‌రు.. వ్యాఖ్య‌లు గుప్పించారు. మొత్తానికి అధికారంలో ఉన్న వారు.. మ‌రీముఖ్యంగా ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉన్న‌వారు.. ఎంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాలో.. ఈ ఉదంతం స్ప‌ష్టం చేస్తోంది.