మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు సమీపించనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపు గుర్రం ఎక్కేందుకు అధికార వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. వ్యూహాలను తెరమీదికి తెస్తోంది. అయితే.. అధిష్టానాల పరంగా.. ఈ రెండు పార్టీలు దూకుడుతోనే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం.. ఈ రెండు పార్టీల నాయకులు.. మల్లగుల్లాలు పడుతున్నారు. తమకు టికెట్ వస్తుందో.. రాదో. అనే దిగులుతోనూ ఉన్నారు. వైసీపీలో అయితే.. జగన్ స్పష్టంగా చెబుతున్నారు.
ప్రజల్లో ఉండే నాయకులే టికెట్లు ఇస్తున్నామన్నారు. తర్వాత.. మళ్లీ.. ప్రజలు ఆమోదించే నేతలకే పట్టం కడతామన్నారు. దీంతో తాము ప్రజల్లో ఉన్నా.. చివరకు సర్వేలు చేయించిన తర్వాత.. తమకు అనుకూలంగా ఉంటేనే.. టికెట్లు వస్తాయని.. నాయకులు మానసికంగా రెడీ అయ్యారు. అయితే.. దాదాపు 50 మంది నాయకులు.. మాత్రం.. తమకు టికెట్లు వస్తాయో.. రాదా.. తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి శంకరనారాయణ, ప్రస్తుత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. వంటివారు కూడా ఉండడం గమనార్హం.
దీంతో ఇలాంటివారు ముందుగానే.. అభ్యర్థులను ప్రకటించాలని.. కోరుతున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఆరు మాసాలకు ముందు మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం జగన్ చెప్పారు. దీంతో నాయకులు తల్లడిల్లుతున్నారు. తమకు టికెట్లు రాకపోయినా.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకునే సమయం ఉండదని భావిస్తున్నారు. ఇక, ఇదే విషయంపై టీడీపీ నేతలు కూడా.. తర్జన భర్జన పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని.. ఇప్పటికే స్పష్టంగా వినిపిస్తున్నవాదన.
దీంతో ఆ 40 మంది ఎవరు? ఎక్కడా.. ముందుగానే తేల్చేయాలని కోరుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం.. ముందు తేల్చం.. ముందు.. మీరు ప్రజల్లో ఉండండి.. అని చెబుతోంది. దీంతో వారిలోనూ ఇదే చర్చ సాగుతోందిఎన్నికలకు ఆరు మాసాల ముందు.. అంటే.. అప్పుడు కూడా ప్రకటిస్తారో లేదో చెప్పడం కష్టమని.. గత ఎన్నికల సమయంలో నామినేషన్లకు వారం వరకు.. అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారని.. ఇప్పుడు కూడా అలానే చేయడం ద్వారా..తమకు అవకాశం లేకుండా పోతుందా? అనే చర్చ జోరుగా చేస్తున్నారు. ఏదేమైనా రెండు పార్టీలు కూడా.. తమ అభ్యర్థులను డోలాయమానంలో పడేశాయన్నదివాస్తవం.