ఎన్టీఆర్ కు సీఎం ఆహ్వానం.. తెర‌వెనుక బీజేపీ?

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ విష‌యంలో క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ బొమ్మై ప్ర‌మేయం ఉంద‌ని అంటున్నారు. పైగా.. బీజేపీ కూడా ఉంద‌నే గుస‌గుస కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ను ఆక‌స్మికంగా అసెంబ్లీకి రావాల‌ని ఆహ్వానించ‌డం వెనుక బీజేపీ ఖ‌చ్చితంగా ఉంద‌నే చ‌ర్చ‌సాగుతోంది.

వాస్త‌వానికి తారక్.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో తారక్ కర్ణాటక ప్రయాణంపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలో కర్ణాటక ప్రభుత్వం తారక్ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి రావడానికి తారక్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.

అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు. ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్ రాజ్కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు పునీత్. అయితే, తెలుగులోఎంతో మంది న‌టులు ఉన్న‌ప్ప‌టికీ తార‌క్‌నే ఎందుకు పిలిచార‌నేది రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే..
ఇటీవ‌ల కొన్ని రోజుల కింద‌ట అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఎంతో బిజీగా ఉండి కూడా.. జూనియ‌ర్‌తో భేటీ అయ్యారు. 30 నిమిషాల పాటు చ‌ర్చించుకున్నారు. అయితే.. ఏం మాట్లాడుకున్నార‌నేది తెలియ‌దు. కానీ, రాజ‌కీయంగా అది ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, ఇప్పుడు బీజేపీ పాలిత క‌ర్ణాట‌క నుంచి తార‌క్‌కు ఆహ్వానం అందండ వెనుక పొలిటిక‌ల్ రీజనే ఉంటుంద‌ని అంటున్నారు. కార్య‌క్ర‌మం ఏదైనా.. జూనియ‌ర్‌ను ముగ్గులోకి లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే గుస‌గు స వినిపిస్తుండ‌డంగ‌మ‌నార్హం.