Political News

దౌర్జ‌న్యాల‌కు దిగితే జ‌నం త‌రిమి కొడ‌తారు: వైసీపీకి ప‌వ‌న్ వార్నింగ్‌

వైసీపీ నేత‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే.. ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని పవన్ కల్యాణ్ హచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున.. పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారం ఉందని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేన …

Read More »

జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఇప్పుడు స‌డులుతోంద‌నే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చెల్లిని, త‌ల్లిని.. పక్క‌న పెట్టార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తోంది. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌ను జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశార‌ని …

Read More »

చిత్తూరు.. వివాదాలు టీడీపీ, బాబుకి ప‌రీక్షేనా..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని.. త‌మ్ముళ్ల మ‌ద్య వివాదాలు, విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఈ జిల్లాను మూడుగా చేయ‌డంతో నాయ‌కుల మ‌ధ్య ఇప్పుడు ఆధిప‌త్య పోరు మ‌రింత‌గా పెరిగిపోయింద‌ని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. 2019 ఎన్నికల్లో వైఫల్యాన్ని …

Read More »

జగన్ వ్యూహం ప్రజాస్వామ్యానికే హానికరమా ?

జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ప్రజాస్వామ్యానికే హానికరంగా తయారవబోతోందా ? చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఓడిపోవాలని, బంపర్ మెజారిటితో తామే అధికారంలోకి రావాలని ప్రతి పార్టీకి ఉంటుంది. అందుకు తగ్గట్లే ప్రత్యర్ధిపార్టీ అభ్యర్ధులు ఓడిపోవాలని కూడా వ్యూహాలు పన్నుతారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్దంగా జరిగే తంతే అనటంలో సందేహంలేదు. కానీ ఎదుటి పార్టీలకు ఒక్కసీటు కూడా రాకుండా మొత్తం అన్నీ సీట్లు తామే గెలవాలని అనుకోవటం మాత్రం తప్పు. …

Read More »

వైసీపీ ‘బూతుల ప్లీన‌రీ’ : జ‌న‌సేన ఫైర్

అధికార వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు.. సర్కస్ కంపెనీని తలపించాయని జనసేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా.. వైసీపీ నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ మాట్లాడుకున్నారని విమర్శించారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్లు వేశారు. ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని తలపించాయని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ప్లీనరీ పరాకాష్ట అని …

Read More »

వైసీపీ ప్లీన‌రీలో చంద్ర‌బాబు జ‌పం.. వైఎస్‌ను మించి మ‌రీ..!

వైసీపీ నిర్వ‌హించిన ప్లీన‌రీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప్లీన‌రీని వాస్త‌వానికి జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించారు. అయితే.. దీనిలో ఆయ‌న పేరు క‌న్నా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌పంతోనే వైసీపీ నాయ‌కులు త‌రించార‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. రెండో రోజు జ‌రిగిన ప్లీన‌రీలో ఏకంగా 100 సార్ల‌కు పైగా చంద్ర‌బాబుపేరును త‌లుచుకోగా.. కేవ‌లం ప‌ది 15 సార్లు మాత్ర‌మే వైఎస్ …

Read More »

చంద్రబాబు కన్నా తక్కువ అప్పులే చేశా: జగన్

ఏపీ సీఎం జగన్ తాను ప్రవేశపెట్టిన నవ రత్నాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్లీనరీ వేదికగా తాను చేస్తున్న అప్పులపై జగన్ స్పందించారు. చంద్రబాబుతో పోలిస్తే తాను చేస్తున్న అప్పులు తక్కువేనని జగన్ స్పష్టం చేశారు. గతంలో కూడా దాదాపుగా ఇదే బడ్జెట్ అని, అప్పుడు చంద్రబాబు …

Read More »

బీజేపీకి పవన్ పంచ్!

భారతీయ జనతా పార్టీతో రెండేళ్ల ముందు జనసేనకు పొత్తు అయితే కుదిరింది కానీ.. ఆ రెండు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాలేవీ లేవనే చెప్పాలి. పొత్తులో ఉన్నాం అని ఇరు పార్టీల అగ్ర నేతలు అప్పుడప్పుడూ నొక్కి వక్కాణించడం మినహాయిస్తే.. జనాలకైతే ఆ రెండు పార్టీలు కలిసి ఒక కార్యాచరణతో వెళ్తున్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు. బీజేపీతో జట్టు కట్టాక పవన్‌ కోరుకున్న నైతిక మద్దతు ఆ పార్టీ నుంచి, …

Read More »

హ‌ద్దులు చెరిపేశారు.. ప్లీన‌రీ ఉద్దేశం ఇదేనా? నెటిజ‌న్ల కామెంట్లు

ఏపీ అదికార పార్టీ వైసీపీ ప్లీన‌రీపై పార్టీ కార్య‌క‌ర్త‌లు.. నాయకులే కాదు.. ప‌రోక్షంగా ఆ పార్టీ సానుభూతి ప‌రులు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. ఏదో చెబుతారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. దానిని అందిపుచ్చుకుని ముందుకు సాగ‌వ‌చ్చ‌ని.. అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. కానీ, ప్లీన‌రీ ఉద్దేశం మాటేమో కానీ.. ప్లీన‌రీలో రెండో రోజు నాయ‌కులు.. మంత్రులు అంద‌రూ కూడా హ‌ద్దులు చెరిపేశారు. ‘దుష్ట‌చ‌తుష్టయంపై తీర్మానం’ పేరుతో అక్క‌సు క‌క్కేశారు. …

Read More »

లీకులు.. చేరిక‌లు.. అల‌క‌లు.. టీ కాంగ్రెస్ లో విచిత్ర ప‌రిస్థితి..!

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోందా..? రేవంత్ నాయ‌క‌త్వంలో దూసుకెళుతోందా..? టీఆర్ఎస్‌, బీజేపీల‌కు దీటుగా రాజ‌కీయాలు చేస్తోందా..? ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్సేన‌ని నిరూపించుకుంటోందా..? వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని చేరిక‌ల‌తో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన‌ మెసేజ్ ఇస్తోందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. అయితే ఇంతా చేస్తున్నా మరోవైపు అల‌క‌ల‌తో అదేస్థాయిలో పార్టీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంద‌ని శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి. దీనికంత‌టికీ కార‌ణం పార్టీలో చేరిక‌ల వ్య‌వ‌హార‌మే అని స్ప‌ష్టంగా …

Read More »

మా అబ్బాయిని విడిచిపెట్టండి: కోడిక‌త్తి శ్రీను త‌ల్లి లేఖ‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. తన …

Read More »

కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణా ఎంపీ ?

తన మంత్రివర్గాన్ని నరేంద్రమోడి విస్తరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మోడీ అనుకున్నారట. …

Read More »