సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ మనుగడ కోసం తాపాత్రయపడుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రను గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఫామ్ లోకి తీసుకు రావడానికి రాహుల్ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక జనాల్లో వీలైనంత వరకు తన స్థాయిని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతొంది.
ఇటీవల మహారాష్ట్ర మీటింగ్ లో రాహుల్ అడ్డ బొట్టు పెట్టుకొని శివ భక్తులను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు అతను ఈ తరహాలో ఎన్నడు కనిపించలేదు. దేశంలో హిందుత్వ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాహుల్ ఈ విధంగా దర్శనమివ్వడం కొంత ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక రాహుల్ అయితే జోడో యాత్రలో చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా అందరిని కలుసుకుంటూ వెళుతున్నాడు. మరి ఈ యాత్ర అతని భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates