వ‌రుస కాంట్ర‌వ‌ర్సీల‌తో ఒంట‌రైపోయిన వైసీపీ నేత‌…!

వ‌రుస వివాదాలు.. వైసీపీలో కీల‌క నాయ‌కుడిని ఏకాకి చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న‌కు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోంద‌ని అంటున్నారు. ఇక‌, జిల్లాలో అయినా.. నాయ‌కుల‌కుఆయ‌న‌కు అస‌లు ప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస‌రావు. తాజాగా ఆయ‌న‌ను పార్టీలోని జిల్లా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. త‌ర్వాత ఆయ‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

దీనికి కార‌ణం వ‌రుస వివాదాలేన‌ని అంటున్నారు లోక‌ల్ నాయ‌కులు. గ‌తంలో అర‌గంట‌.. అంటూ ఒక ఆడియో క్లిప్ రాగా.. త‌ర్వాత జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అది కాస్తా పోయింది. ఇది ఆ ఎఫెక్టే అనే వాద‌న వినిపించింది. ఇక‌, ఇటీవ‌ల మ‌రో ఆడియో కూడా క‌ల‌క‌లం రేపింది. ఈ ప‌రిణామాల త‌ర్వాత పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు. సో ఈ రెండు ఘ‌ట‌న‌ల‌నుపార్టీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుం ద‌ని అందుకే ఆయ‌న‌కు వ‌రుస షాకులు త‌గిలాయ‌ని అంటున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. విశాఖ‌ప‌ట్నంలోని ముఖ్య‌నాయ‌కుల‌కు, అవంతికి మ‌ధ్య గ్యాప్ అలానే ఉంది. ఇంత‌కు ముందు ఆయ‌న బ‌ల‌మైన గ‌ళంగా ఉండేవారు. అయితే, త‌న‌ను సాయిరెడ్డి డామినేట్ చేస్తున్నార‌ని, అప్పట్లో మంత్రిగా ఉన్నా.. త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని అనేవారు. ఇక‌, ఇప్పుడు ఉత్త‌రాంధ్ర జిల్లాల బాధ్య‌త‌ల‌ను వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. పోనీ ఆయ‌నైనా అవంతి విష‌యంలో సానుకూలంగా ఉన్నారా? అంటే, అది కూడా క‌నిపించ‌డం లేదు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే, త‌నకు రాజ‌కీయంగా వైరం ఉన్న గంటా శ్రీనివాస‌రావుకు వైసీపీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఆఫ‌ర్లు ఇస్తుండ‌డం అవంతికి అస‌లు న‌చ్చ‌డం లేదు, గంటా ఎక్క‌డ జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారోన‌ని భావిస్తున్న వైసీపీ, ఇటీవ‌ల కూడా ఆయ‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌నే క‌నుక వైసీపీలోకి వ‌స్తే.. త‌న భీమిలి సీటుకు ఎస‌రు పెట్ట‌డం ఖాయ‌మ‌ని.పైగా.. అంతో ఇంతో ఉన్న హ‌వా కూడా తుడిచి పెట్టుకుపోతుంద‌ని కూడా అవంతి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని అంటున్నారు.