Political News

మిత్రపక్షాలకు కాలం చెల్లినట్లేనా ?

మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన మధ్య విశాఖ ఉక్కు పెద్ద చిచ్చు పెట్టినట్లు సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పొత్తుల విషయంలో తాము పునరాలోచించాల్సుంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ డైరెక్టుగానే హెచ్చరించారు. అయితే నాదెండ్ల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరుచేయలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత జోరు పెంచింది. ప్రైవేటీకరణ అంశం …

Read More »

తెరవెనుక చక్రం తిప్పుతోందా ?

సరిగ్గా ఎన్నికల ముందు ఈమధ్యనే జైలు నుండి విడుదలైన వి. శశికళ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారా ? తమిళ రాజకీయాలను చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి తానే అని శశికళ ఎంత చెప్పుకున్నా సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో డీఏకే కూటమిదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు తనకు ఏమాత్రం ఆశాజనకంగా లేవని శశికళకు అర్ధమైపోయింది. దీంతో …

Read More »

మోడికి స్పీడుకు బ్రేకులు పడటం ఖాయమేనా ?

పశ్చిమబెంగాల్లో ఎన్నికల కుంపట్లు బాగా రగులుకుంటున్నది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో రెండు వైపుల అగ్రనేతలు రగిలిపోతున్నారు. ఇందులో బాగంగానే నరేంద్రమోడి తరపున అమిత్ షా+కేంద్రమంత్రులు, పార్టీ నేతలు మమతాబెనర్జీని టార్గెట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మమత కూడా అంతే స్ధాయిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. వీళ్ళద్దరి …

Read More »

తిరుపతి మీద ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనను బీజేపీ వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే స్ధానిక బీజేపీ నేతల మనోభావలతోను, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో ఏమాత్రం సబంధం లేకుండా, పట్టించుకోకుండా తనిష్టం వచ్చిన నిర్ణయాలను కేంద్రం తీసేసుకుంటోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఇందులో భాగమే. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎంత ప్రయత్నించినా ఈ విషయమై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా …

Read More »

బెజ‌వాడ‌లో ఆ రెండు సామాజిక వ‌ర్గాలు ఎటు వైపు..?

అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణాల్లో ఈ ఆవేద‌న ఎక్కువ‌గా ఉంది. పైగా వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాలు ఈ విష‌యంలో మ‌రింత బాధ‌ప‌డుతున్నాయి. బెజ‌వాడ‌లో ఈ రెండు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌. సెంట్ర‌ల్‌లో బ్రాహ్మ‌ణ‌, ప‌శ్చిమ‌లో వైశ్య‌లు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీరు ఎవ‌రి వైపు మ‌ద్ద‌తుగా …

Read More »

ప్ర‌భుత్వంపై చండ్ర‌నిప్పులు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ స‌ర్కారు స‌హా సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు కురిపించారు. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో ప‌ర్య‌టించి పార్టీ శ్రేణుల‌తో భేటీ కావాల‌ని భావించిన చంద్ర‌బాబుకు తిరుప‌తి పోలీసులు అడ్డు చెప్పారు. న‌గ‌రంలోకి అనుమ‌తి లేద‌ని.. పోలీస్ యాక్ట్ 30 అమ‌ల్లో ఉంద‌ని.. బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ హ‌ఠాత్ప‌రిణామం తో చంద్ర‌బాబు రేణిగుంట విమానాశ్ర‌యంలోనే భేటీ …

Read More »

వంటగ్యాస్ రాయితీని ఎత్తేస్తారా ?

ఒకపుడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వంటగ్యాస్ రాయితికి ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ మంగళం పాడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంటగ్యాస్ సబ్సిడీని బాగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటురంగానికి ప్రోత్సహం ఇవ్వాలనే అజెండాను మోడి ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మోడినే వెబినార్ ద్వారా జరిగిన సమావేశంలో …

Read More »

ఇబ్బంది పడిపోయిన బీజేపీ అధ్యక్షుడు

బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇపుడు విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గడచిన నెల రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఉక్కు ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అన్నీ పార్టీలు తమ …

Read More »

బీజేపీకి భారీ సవాల్ విసిరిన పీకే.. మే2న చివరి ట్వీట్ చేస్తాడట

రాజకీయ పార్టీలకు సవాలు విసరటం పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కు అలవాటే. రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. తాను ఒకసారి ఏదైనా రాజకీయ పార్టీకి సేవలు అందించటం మొదలుపెడితే చాలు.. వారిని విజయతీరాలకు తీసుకెళ్లే వరకు విశ్రమించరన్న పేరు ఆయన సొంతం. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గడిచిన కొద్దికాలంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్ కు సేవలు అందిస్తున్న ఆయన.. తాజాగా ఆసక్తికర …

Read More »

5న ఉక్కు ఉద్య‌మం.. రాజుకుంటున్న విశాఖ పోరు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వ‌ర్యంలో మార్చి 5న బంద్‌కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉద్య‌మానికి దీనిని ప‌తాక స్థాయిగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో …

Read More »

ఆ నలుగురూ బ్లాక్ మెయిలర్లట – ఆర్కే సంచలనం

నలుగు బీజేపీ నేతలపై ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ డైరెక్టుగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వాన్ని చూపించి రాష్ట్రంలో నలుగురు నేతలు అందరినీ బెదిరిస్తు బతకటానికి అలవాటు పడిపోయారట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి, జీవిఎల్ నరసింహారావు అందరినీ బెదిరిస్తు బతికేస్తున్నారట. వీళ్ళకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ అండగా నిలబడ్డారట. మొత్తానికి నలుగురు నేతలపై రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లనే ముద్ర వేసేశారు. …

Read More »

ఫుల్ గా తాగేసి జూబ్లీహిల్స్ లో యూట్యూబ్ స్టార్ రచ్చ

అతడో యూట్యూబ్ స్టార్. గూగులమ్మలో అతడి పేరు కొట్టినంతనే.. యూట్యూబ్ లో బోలెడన్నివీడియోలు కనిపించేస్తాయి. యూత్ లో మాంచి పేరును సొంతం చేసుకోవటమే కాదు.. వచ్చే బిగ్ బాస్ షోకు అల్రెడీ ఎంపికైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాంటోడు ఎంత బాధ్యతగా.. మరెంత పద్దతిగా వ్యవహరించాలి? అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్ గా తాగేసి బీభత్సాన్ని సృష్టించాడు. ఇంతకీ అంత రచ్చ చేసిన ఆ యూట్యూబ్ స్టార్ …

Read More »