Political News

జ‌గ‌న్ మెడ‌కు టికెట్ల గొడ‌వ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని థియేట‌ర్ల‌లో టికెట్ల ధ‌ర‌ల‌పై ఉన్న‌ట్లుండి నియంత్ర‌ణ తీసుకురావ‌డం కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. వేరే స‌మ‌యంలో ఈ ప‌ని చేసి ఉంటే దాని మీద వివాదం న‌డిచేది కాదు కానీ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజైన‌పుడు ప‌ట్టుబ‌ట్టి ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ తీసుకురావ‌డం, థియేట‌ర్ల ‌మీద దాడులు చేయడం, టికెట్ల ధ‌ర‌ల‌పై చాలా ఏళ్ల కింద‌టి జీవోను ఇప్పుడు రిలీజ్ చేయ‌డంతో …

Read More »

అచ్చెన్న‌ వీడియో లీక్: టీడీపీ పని అయిపోయిందా..

తిరుప‌తి పార్ల‌మెంటుకు ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి. టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. పార్టీ ప‌రిస్థితి ఏమీలేద‌ని.. వ‌చ్చే 17 త‌ర్వాత పార్టీ ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తున్న స‌మ‌యంలో అచ్చెన్న చేసిన కామెంట్లు స్టింగ్ ఆప‌రేష‌న్ రూపంలో బ‌య‌ట‌కు …

Read More »

సోముకు ఇదే ఆఖ‌రి పోరాటం.. ఫెయిలైతే..?

రాష్ట్ర బీజేపీ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌గా మారింది. సామాజిక వ‌ర్గాల‌ను స‌మీక‌రించ‌డంలోను.. ఓటు బ్యాంకును పెంచుకోవడంలోను, ఉన్న ఓటు బ్యాంకును బ‌లోపేతం చేసుకోవ‌డంలోను నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నారు. గ‌తంలో అంటే.. ప‌దేళ్ల కింద‌ట చూసుకుంటే.. బీజేపీకి కూడా కొన్ని ప్రాంతాల్లో సంస్థాగ‌తంగా ఓటు బ్యాంకు ఏర్ప‌డింది. త‌ర్వాత‌.. అప్ప‌టి నాయ‌కులు ఆ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. ఇంత‌లోనే జాతీయ రాజ‌కీయాల్లో వ‌చ్చిన మార్పుల నేప‌థ్యంలో కీల‌క నేత‌లు …

Read More »

చంద్రబాబులో జోష్ నింపిన ఉపఎన్నిక ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు ? నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా వైసీపీనే గెలుస్తుందని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే ఇదే ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో కూడా ఓ విధంగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ ఎలా వస్తుంది ? ఎలా వస్తుందంటే ఉపఎన్నికకు ముందు …

Read More »

‘సాగ‌ర్’ పోరులో కేసీఆర్‌కు తొలి ఎదురుదెబ్బ‌.. ఏం జ‌రిగిందంటే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి తొలి ఎదురు దెబ్బ త‌గిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. దాదాపు ల‌క్ష‌ మంది తో ఈ స‌భ నిర్వ‌హించేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌నలు కూడా ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో భౌతిక …

Read More »

తిరుపతి ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుందా ?

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఏ విషయంలో ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుంది ? ఎలాగంటే డబ్బు విషయంలో. అవును  ఏ ఎన్నికలో అయినా ప్రధాన భాగం ఖర్చులదే ఉంటుంది. ఎన్నికలు ఇంత కాస్ట్లీ అయిపోయిందంటే అందుకు ప్రతిపార్టీని తప్పు పట్టాల్సిందే. మామూలుగా ఓ పార్లమెంటు జనరల్ సీటుకు ఎన్నిక జరిగితే తక్కువలో తక్కువ రూ. 100 కోట్లు ఖర్చువుతుందనటంలో సందేహం లేదు. అలాగే అసెంబ్లీ జనరల్ సీటుకు …

Read More »

పవన్ జెండా ఎత్తేసినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చాటిచెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు భీమవరం అటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు. అయితే జనాలు పవన్ను రెండు నియోజకవర్గాల్లోను తిరస్కరించారు. నామినేషన్ వేయటానికి ముందు చాలా పెద్ద కసరత్తులు చేసిన తర్వాతే పై రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. భీమవరం సంగతిని వదిలేసినా గాజువాకలో ప్రచారం చేసే సమయంలో పవన్ …

Read More »

జ‌న‌సేనలో ఏం జ‌రుగుతోంది ? సీనియ‌ర్ల కామెంట్లతో హీటెక్కిన పాలిటిక్స్

‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది ? అస‌లు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా అధికారం లోకి వ‌స్తుందా? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ఏపీ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కు డు.. మాదాసు గంగాధ‌రం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. న‌చ్చని ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏ నేతైనా.. స‌ద‌రు …

Read More »

రెండుచోట్లా బీజేపీ పరిస్ధితి సేమ్ టు సేమ్ ?

తెలంగాణా, ఏపిలో రెండు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలోను బీజేపీ మాత్రం తిరుపతి లోక్ సభకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేసేందుకు తెలంగాణా బీజేపీ నేతలు కూడా వరుసగా క్యూ కడుతున్నారు కాబట్టి. నిజానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం …

Read More »

పోలింగుకు ముందే చేతులెత్తేసిన ప్రతిపక్షాలు

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికి ఇదే అభిప్రయాం కలుగుతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక్కసారిగా ప్రతిపక్షాలు అధికారపార్టీ అభ్యర్ధిపై ఆరోపణల దాడులను పెంచేశాయి. నిజానికి ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తోంది. వాటిల్లో ఏమైనా లోటుపాట్లు, అవినీతి, అక్రమాలుంటే ప్రతిపక్షాలు వాటిని టార్గెట్ చేసుకోవాలి. అయితే విచిత్రంగా వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని టార్గెట్ చేస్తున్నాయి. వ్యక్తిగతంగా జగన్ కు సేవచేసిన కారణంగా …

Read More »

ఉపఎన్నికలో బీజేపీ విపరీతం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ చేసిన పని అందరికీ విపరీతంగానే అనిపిస్తోంది. తాజాగా ఉపఎన్నిక విషయంలో కమలనాదులు మ్యానిఫెస్టోను విడుదల చేయటమే ఈ చర్చకు దారితీసింది. ఒక ఉపఎన్నిక కోసం ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ నేతలు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆచరణ సాధ్యంకాని హామీలన్నింటినీ గుప్పించేటప్పటికి కమలనాదుల చర్య అందరికీ వైపరీత్యంగానే కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల సమయంలో …

Read More »

వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తారా ?

రాజకీయంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలైనాక అసెంబ్లీలో తీర్మానం చేయాలట. తీర్మానం తర్వాత రెండుపార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలట. అప్పుడు వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. మరి అచ్చెన్న సవాలుకు చంద్రబాబునాయుడు అనుమతి ఉందో లేదో తెలీదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా చేసుకునే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు …

Read More »