దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి …
Read More »రెడ్లలో సింపతీ ఎందుకు రాలేదు…
సహజంగానే రాజకీయాలు సామాజిక వర్గాలకు అనుకూలంగా మారాయి. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అంటే.. వైసీపీ, కమ్మ వర్గం అంటే టీడీపీ అనుకునే పరిస్థితి దశాబ్దంన్నర నుంచి కనిపిస్తోంది. అయితే.. కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత.. రెడ్డి వర్గంలో కనిపించడంలేదు. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి వర్గం ఏకమైంది. కానీ.. తర్వాత.. జగన్ తమకు ఏమీ …
Read More »వైసీపీ దూకుడుకు పోలీసుల కళ్లెం.. ఫస్ట్ టైమ్!
వైసీపీ అధినేత జగన్ తాజాగా గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అయితే.. ఆయన పర్యటనలకు భారీగా కార్యకర్తలను పోగు చేస్తుండడం.. దీంతో తొక్కిసలాటలు, వంటివి జరిగే ప్రమాదం ఉంటుందని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఆంక్షలు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ.. జగన్ సహా వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఈ ఆంక్షలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిణామమే రెంటపాళ్లలో చోటు చేసుకుని సింగయ్య అనే వైసీపీ కార్యకర్త.. ఏకంగా జగన్ కాన్వాయ్ …
Read More »ఏపీలో పెట్టుబడి దారులకు ఇక రెడ్ కార్పెట్టే!
ఏపీలో పెట్టుబడి దారులకు దాదాపు రెడ్ కార్పెట్ పరిచినట్టే అయింది. ఇప్పటి వరకు కొందరు పెట్టుబడి దారులు.. విపక్షాలు సహా.. ఇతర ఉద్యమ కారుల విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కల్పించే మౌలిక వసతులపై.. యాగీ చేస్తారని.. ముఖ్యంగా భూములు.. ఇతరత్రా కీలక విషయాల పై తమకు ఇబ్బందులు వస్తాయని భావించారు. సహజంగా ఇప్పటి వరకు జరిగింది అదే. దీంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా.. వెనక్కి …
Read More »‘జగన్ అవినీతి శాస్త్రవేత్త..’
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ కీలక నాయకులు ఒకే రోజు విరుచుకుపడ్డారు. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకకాలంలో జగన్‌పై నిప్పులు చెరిగారు. ఇద్దరు వేర్వేరుగా స్పందించినా.. ఒకే అంశంపై జగన్‌పై దుయ్యబట్టారు. మద్యం కుంభకోణాన్ని సెంట్రిక్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. మాణిక్కం …
Read More »ఏదో ఒక రోజు వస్తా: పార్లమెంటులో బాలయ్య సందడి!
టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం శాసన సభ్యుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గురువారం అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టీడీపీ పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అక్కడ విజిటర్స్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంటు స్పీకర్‌కు బాలయ్యను.. టీడీపీ సభ్యులు పరిచయం చేశారు. తొలుత పార్లమెంటు సెంట్రల్ హాల్లో అన్నగారు ఎన్టీఆర్ …
Read More »బాబు పెట్టుబడుల వేట.. జగన్ పొలిటికల్ వేట!
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. తద్వారానే రేయింబవళ్లు ఏర్పడుతున్నాయి. అలా.. చంద్రబాబు ఒకవైపు.. రాష్ట్రంలో పాలన చేస్తూ.. మరోవైపు.. పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. దావోస్ సహా.. ఎక్కడ ఏవేదిక కనిపించినా.. పెట్టుబడులపై ప్రత్యేక ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ సదస్సు అయినా.. తర్వాత.. తాజాగా వెళ్లిన సింగపూర్ అయినా.. లక్ష్యాలు ఒక్కటే.. అర్జునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్టుగా.. బాబుకు పెట్టుబడులు …
Read More »వారంతా దోపిడీ దారులు.. జగన్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా దోపిడీ దారులు.. అని ప్రకటించారు. గనులు, వనరులు.. ఇసుక, మద్యం, చివరకు.. పేదలు తినే బియ్యాన్ని కూడా దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(గతంలో వైసీపీ నాయకుడు)పై జగన్ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. స్థానికంగా గనులను ఆయన సీజ్ చేసేశారని.. తాను చెప్పిన వారికి మాత్రమే …
Read More »ఎమ్మెల్యేల జంపింగుల విషయాన్ని 3 నెలల్లో తేల్చండి: సుప్రీం
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలకు చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ పార్టీ టికెట్‌పై విజయం దక్కించుకుని.. పొరుగు పార్టీలో చేరిన ఎమ్మెల్యే లను వదిలేది లేదని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. న్యాయ పోరాటం కొనసాగిస్తునే ఉన్నారు. తొలుత హైకోర్టు.. తర్వాత సుప్రీంకోర్టు వరకు.. ఈ కేసును కొనసాగించారు. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు.. స్పందించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై …
Read More »ఏపీ ఇప్పుడే గాడిన పడుతోంది.. ఎందుకు అడ్డుకుంటారు?: హైకోర్టు
ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఇప్పుడే గాడిన పడుతోం దని.. ఇంతలోనే అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని.. పిటిషనర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. “మీకు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేక పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది సరికాదు. ఏపీ ప్రభుత్వానికి స్వేచ్ఛనివ్వండి. కొన్నాళ్లు వేచి చూడండి. ఆ తర్వాత.. ఏం జరుగుతుందో చూద్దాం. అంతేకానీ.. ఇప్పటికిప్పుడు …
Read More »జగన్‌కు షర్మిల నుంచి మరింత కాక.. !
రాజకీయాల్లో ఒక పరిణామానికి మరికొన్ని పరిణామాలు కారణాలు అవుతాయి. ఉదాహరణకు చంద్రబాబుపై నమోదు చేసిన కేసు వైసీపీ హయాంలో ఆయనను జైలుకు పంపించిన తీరు వంటివి మేలు చేస్తాయని జగన్ భావించగా అవి మేలు చేయకపోగా సమాజంలోని రెండు మూడు సామాజిక వర్గాలను ఏకం చేశాయి. అంటే ఒక అరెస్టు కారణంగా అనేక మార్పులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా జగన్‌కు నష్టాన్ని చేకూర్చింది. ఇలా ఒక విషయానికి …
Read More »ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన.. లక్ష్యం సాకారమేనా?!
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌లతో కలిసి నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆయన సింగపూర్‌లో ఉన్నారు. బుధవారం సాయంత్రం(స్థానిక కాలమానం ప్రకారం) 5 గంటలకు ఆయన తన పర్యటనను ముగించుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు, అటు నుంచి అమరావతికి చేరుకుంటారు. అయితే.. ఈ ఐదు రోజుల పర్యటన వెనుక.. చంద్రబాబు లక్ష్యం నెరవేరిందా? …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates