ఒక అక్రమం.. అన్యాయం చేయాలంటే.. ఎంతో సాహసం ఉండాలి. పైగా ఎవరినో ఒకరిని చూసైనా నేర్చు కోవాలి. ఇలానే స్ఫూర్తి పొందిన వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె.. నేహా రెడ్డి ఇప్పుడు కోట్ల సొమ్మును వదిలించుకుంటున్నారు. అక్రమమని తెలిసి కూడా.. సక్రమంగా మార్చే ప్ర యత్నాలు చేసి.. చిక్కుల్లో పడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… అనేక మంది అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే.. సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి.. మరింత దూకుడుగా వ్యవహరించారు. రుషికొండపై అప్పటి ప్రభు త్వం భారీ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టాలకు వ్యతిరేకమని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున ఆందోళనలను తెరమీదికి వచ్చాయి. అయినా.. వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వినిపించుకోలేదు. పైగా.. నిర్మాణాలను కొనసాగించి.. 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కుమార్తె కూడా.. ఇలాంటి నిర్మాణాలకే ప్రాధాన్యం ఇచ్చారు.
భీమిలిలోని బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆక్రమించి రిసార్టు ఏర్పాటు చేయాలని నేహారెడ్డి ప్రయత్నించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో నిర్మాణాలు ముందుకు సాగాయి. కానీ.. వాస్తవానికి కేంద్ర పర్యావ రణ, సముద్ర చట్టాల ప్రకారం.. బీచ్‌లో ఎలాంటి రిసార్టులు కట్టేందుకు అనుమతిలేదు. దీని గురించి తెలిసినా.. జగన్ బాటలోనే మొండిగా ముందుకు సాగారు సాయిరెడ్డి కుమార్తె. పెద్ద ఎత్తున ప్రహరీ నిర్మించారు. అనంతరం.. రిసార్టుకు అవసరమైన నిర్మాణాలను కూడా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
ఇంతలో ఇది కోర్టుకు చేరింది. దీంతో అప్పటి వరకు పూర్తయిన గోడను కూల్చేయడంతోపాటు.. పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లేలా చేసినందుకు.. 17 కోట్ల రూపాయల ఫైన్ పడింది. ఇక, ఇప్పటికే కట్టిన గోడను కూల్చేందుకు ఒకసారి 48 లక్షల రూపాయలను విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెల్లించారు. అయితే.. ఆ సొమ్ము సగం గోడను మాత్రమే కూల్చేందుకు సరిపోయాయని కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు 37 లక్షలు కట్టాలని కోరింది. దీనిని తాజాగా హైకోర్టు కూడా సమర్థించింది. సో.. మొత్తంగా చూస్తే.. జగన్ బాటలో మొండిగా నడిచి.. సాయిరెడ్డి కుమార్తె..చేతి చమురు బాగానే వదిలించుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates