తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ‘రాజీనామా’ యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో రైతు రుణమాఫీ రూ.2 లక్షల వరకు చేస్తానని చెప్పి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ చేయలేదని.. గతంలో హరీష్ రావు ప్రస్తావించారు. రైతు రుణ మాఫీ చేసి.. మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అంటూ.. రేవంత్పై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే అటు కాంగ్రెస్ నేతలు …
Read More »కేంద్ర బడ్జెట్.. బాబు డిమాండ్లు ఇవే
ఇంకో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మూడో పర్యాయం మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఐతే గతంతో పోలిస్తే బడ్జెట్ భిన్నంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. ఏపీలో టీడీపీ, బీహార్లో జేడీయూ సాధించిన సీట్లు కీలకంగా మారి, వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని …
Read More »కంగానా రనౌత్ ఏం నీతులు చెప్పారు
మాటకు మాట పేల్చడంలో తనకు తానే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తారు.. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం ఎంపీ.. నటి కంగానా రనౌత్. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమె.. బీజేపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఆవెంటనే.. వివాదస్పద ప్రకటన గుప్పించారు. తనను కలిసేందుకు వచ్చే వారు.. ఎవరైనా సరే.. ఆధార్ కార్డు చూపించాలని, అడ్రస్ నిరూపించుకునే పత్రాలు తీసుకురావాలని వ్యాఖ్యానించి.. రాజకీయాల్లో సెగ పుట్టించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే …
Read More »ఎంపీడీవో కుటుంబానికి బాబు ఫోన్.. ఎవరాయన? ఏం జరిగింది?
ఎంపీడీవో…మండల పరిషత్ డెవలప్ మెంట్ అధికారి. వాస్తవానికి ప్రభుత్వ శాఖల పరంగా చూస్తే.. ఇది చిన్న ఉద్యోగం. మరి అలాంటి ఎంపీడీవో కుటుంబానికి ఏకంగా.. ఎంతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఇది అసాధారణం. మరి ఏం జరిగింది? ఎవరా ఎంపీడీవో! ఇదీ.. ఇప్పుడు అందరినీ ఆసక్తిగా చర్చించుకునేలా చేసింది. నిజానికి ఎంపీడీవో వ్యవహారం రెండు రోజులుగా వార్తల్లో వచ్చినా.. ఎవరూ పెద్దగా …
Read More »పిన్నెల్లికి హైకోర్టు షాక్: కేసులపై తీవ్ర వ్యాఖ్యలు
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు.. కేసు విషయంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిపై తర్వాత.. సీఐ నారాయణ స్వామి, టీడీపీ పోలింగ్ బూత్ …
Read More »పుంగనూరులో హై టెన్షన్..మిథున్ రెడ్డిపై దాడి
పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప నివాసం దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనకు నిరసనగా టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గోబ్యాక్ …
Read More »ముద్రగడ… అంబటి… అక్కడితో సరి!
వైసీపీలో కీలకంగా వ్యవహరించి.. పార్టీ గెలుపు కోసం.. పంతాలకు కూడా పోయిన నాయకుడు ఒకవైపు. సంక్రాంతి పేరుతో రోడ్లపై డ్యాన్సులు వేస్తూ.. నోటికి వచ్చింది మాట్లాడే మాజీ మంత్రి మరోవైపు. వీరిద్దరూ కలుసుకున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో కలుసుకున్నట్టు సమాచారం. వారే.. ఒకరు ముద్రగడ పద్మనాభం. మరొకరు అంబటి రాంబాబు. ఏంటి స్పెషల్ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటీవల ముద్రగడ రాజకీయ శపథం చేసి.. జనసేన అధినేత పవన్ గెలిస్తే.. …
Read More »ఏడాదికి 25 వేల కోట్లు.. ఇదీ సంపద సృష్టి!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తరచుగా సంపద సృష్టిస్తాం.. సంక్షేమాన్ని అమలు చేస్తాం.. అని చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించిన ‘సూపర్ 6’ పథకాల గురించి అందరికీ తెలిసిందే. ఆయా పథకాలు అమలు చేయాలంటే.. ఆర్బీఐనే ఏపీలో ఏర్పాటు చేయాలంటూ.. వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. మరికొందరు ఇలాంటివన్నీ.. తూచ్! అని వ్యాఖ్యానించారు. అయితే.. చంద్రబాబు సర్కారు ఇప్పుడు.. సూపర్ 6 పథకాల అమలుపై ప్రత్యేక …
Read More »ఏపీ అసెంబ్లీకి ఊపిరి…నివ్వెర పోయే నిజం వెలుగులోకి!
అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. అయితే.. గత వైసీపీ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని కూడా భ్రష్టు పట్టించే పని చేసింది. ఎవరూ ఊహించడానికి కూడా తావు లేకుండా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ విషయం వెలుగు చూసిన తర్వాత.. అందరూ నివ్వెర పోతున్నారు. ప్రస్తుతం ఈ భ్రష్టత్వాన్ని తాజాగా బాధ్యతలు చేపట్టి నూతన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తొలగించారు. దీంతో వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాస్వామ్య వాదులు …
Read More »వైసీపీకి ఇంత డ్యామేజీకి వెంకటరెడ్డే కారణమా..!
వైసీపీ అధికారం కోల్పోయింది. అయితే.. ఇది సాధారణంగా జరిగింది కాదు.. అత్యంత దారుణంగా అధికారం కోల్పోయింది. ఎక్కడి 151.. ఎక్కడి 11. ఈ స్థాయిలో వైసీపీ దారుణంగా పరాజయం పొందడానికి కారణమేంటి? ఎందుకు ఇంతలా ప్రజలు ఆ పార్టీని ఛీకొట్టారనే విషయాన్ని పరిశీలిస్తే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధానంగా కనిపిస్తోంది. అయితే.. దీనికంటే ఎక్కువగా గనుల శాఖ డైరెక్టర్గా వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుని మరీ నియమించుకున్న వెంకటరెడ్డి.. సర్కారు …
Read More »షర్మిల సొమ్ములు కొట్టేశారా? నేతల గుస్సా వెనుక!
ఏపీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు పెరుగుతున్నాయా? ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు వ్యతిరేకంగా కీలక నాయకులు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారా? అంటే అవుననే అంటున్నారు సీనియర్ నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు వచ్చినా ఎన్నికలకు ముందు షర్మిల ఒంటెత్తు పోకడలు పోయారని విమర్శలు ఎదురైనా ఆమెను అధ్యక్షురాలుగా కొనసాగించేందుకు పార్టీ …
Read More »నందికొట్కూరులో నయా రాజకీయం !
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర ఓటమి నేపథ్యంలో ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉన్న వారు ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రాలయం మినహా అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించింది. నంద్యాల లోక్ సభ స్థానం నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరి టీడీపీ నుండి విజయం సాధించింది. నందికొట్కూరు స్థానం నుండి ఎమ్మెల్యేగా టీడీపీ నుండి …
Read More »