రాజకీయాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా.. ప్రత్యర్థులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో 2014 తర్వాత అనేక మార్పులు సంతరించుకున్నాయి. ప్రధాని పీఠంపై కూర్చున్న నరేంద్ర మోడీ.. వ్యూహాత్మక అడుగులు వేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఏయే విషయాలను విస్మరించిందో.. ఆయా విషయాలను ఆయన అందిపుచ్చుకున్నారు. బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నారు.
ఇలాంటి వాటిలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిస్తే.. అవి నరేంద్ర మోడీకి రాజకీయంగా ఎంత మైలేజీ ఇచ్చాయన్నది అర్థమవుతుంది. వీటిలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. వాస్తవా నికి ఈయనకు బీజేపీకి సంబంధం లేదు. పైగా ఏ పునాదులపై బీజేపీ ఆవిర్భవించిందో.. ఆ పునాదులను పెకలించే ప్రయత్నం చేశారు.. పటేల్. అదే ఆర్ ఎస్ ఎస్. దేశానికి ఉప ముఖ్యమంత్రింగా ఉన్న సమయంలో ఆర్ ఎస్ ఎస్‌పై నిషేధం విధించారు. కానీ, మోడీ సర్కారు వచ్చాక.. ఆయనను ఓన్ చేసుకుంది.
తద్వారా.. అదేసామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా తిప్పుకోవడమే కాదు.. దేశవ్యాప్తంగా పటేల్ అంటే .. బీజేపీ మనిషిగా భావించే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం తీసుకువచ్చింది. ఇక, ఆ తర్వాత.. కాలంలో రాష్ట్రపతిగా పనిచేసిన.. ప్రణబ్ ముఖర్జీని కూడా మోడీ ఓన్ చేసుకున్నారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగాల్‌కు చెందిన ప్రణబ్.. కాంగ్రెస్ వాదిగా.. కేంద్ర మంత్రిగా ముద్ర వేసుకున్నారు. గాంధీల కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు.
కానీ, ఆయనకు మరణాంతరం భారత రత్న ఇవ్వాలన్న వాదనను కాంగ్రెస్ పక్కన పెట్టింది. దీనిని అంది పుచ్చుకున్న మోడీ.. ఆయనకు భారత రత్న ప్రకటించి.. పశ్చిమ బెంగాల్‌లో పాగా వేశారు. ఈ పరంపరలో ఇప్పుడు ‘వందేమాతరం’ గేయానికి పెద్దపీట వేశారు.. మోడీ. వాస్తవానికి ఈ గేయాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది.. స్వాతంత్ర సమరంలో పెద్ద ఎత్తున ఉద్యమంగా మలిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కానీ.. ఓన్ చేసుకోలేక పోయింది. ఇప్పుడు దీనిని బీజేపీ తరఫున మోడీ ఓన్ చేసుకుని.. దేశవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తున్నారు. అదేసమయంలో కర్పూరీ ఠాకూర్(బెంగాల్ మాజీ సీఎం)కు భారత రత్న ఇవ్వడం ద్వారా ఆయన సామాజిక వర్గాన్ని కూడా కాంగ్రెస్‌కు దూరం చేసిన వ్యవహారంలో మోడీ వ్యూహాన్ని గుర్తెరగాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates