వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే …
Read More »సీమపై కూటమి స్పెషల్ ఫోకస్..!
రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? విపక్ష వైసీపీకి బలమైన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు కీలక కార్యక్రమాలను సీమలో నిర్వహించడం ద్వారా కూటమి పార్టీలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే చాలా పక్కా ప్లాన్తోనే వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడును వైసీపీ అధినేత …
Read More »మంచి టైమింగ్.. లోకేష్ గ్రాఫ్ పైపైకి..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ మంత్రి నారా లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో పతాక శీర్షిక అయింది. నేపాల్లో సంభవించిన అల్లర్ల కారణంగా అక్కడ తెలుగు వారు చిక్కుకుపోయారు. ఒక్క తెలుగు వారే కాదు, దేశం నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లిన చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి దీనిపై అధికారులకు బాధ్యతలు అప్పగించి …
Read More »త్రిశంకు స్వర్గంలో వైసీపీ.. 15 నెలలు.. వరుస షాకులు…?
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసిపి వ్యవహారం త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. గడిచిన 15 నెలలుగా ఈ పార్టీ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే కేవలం సోషల్ మీడియాకు పరిమితమైనట్టు స్పష్టమవుతుంది. వాస్తవానికి అధికారం కోల్పోయినంత మాత్రాన జన ఆదరణ కోల్పోతారని ఎవరు ఊహించరు. ఇది వైసీపీ విషయంలోనూ జరిగే అంశమే. కానీ, ఈ విషయాన్ని గుర్తించడంలో వైసిపి నేతలు ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ వెనకబడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ …
Read More »కాలేజీకి అలా.. అమరావతికి ఇలా.. ఇదేం లాజిక్ జగన్?
ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉండగా జగన్ సర్కారు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా వైసీపీ వాళ్లు చెప్పుకునే అంశం.. మెడికల్ కాలేజీల నిర్మాణం. జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మించాడని వైసీపీ వాళ్లు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ఐతే అందులో నాలుగైదుకు మించి కాలేజీల నిర్మాణం జరగలేదు. పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయట్లేదన్నది గ్రౌండ్ రిపోర్ట్. ఈ కాలేజీల నిర్మాణానికి కేంద్ర కూడా …
Read More »‘సూపర్’ గ్రాండ్ సక్సెస్!… టైమంటే టైమే!
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి బుధవారం అనంతపురంలో తొలి విజయోత్సవ సభ “సూపర్ సిక్స్..సూపర్ హిట్”ను నిర్వహించింది. కూటమి పాలన మొదలై 15 నెలలు గడిచిన నేపథ్యంలో తమ పాలన ఎలా సాగిందన్న విషయాన్ని జనానికి చెప్పేందుకు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా సాగుతోందన్న విషయాలను వివరించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా ఈ సభను నిర్వహించాయి. ఈ …
Read More »“మోడీ-బాబు-పవన్-లోకేష్.. నాలుగు స్తంభాలు”
పిట్ట కొంచెం.. కూతఘనం అనే మాటను నిరూపించారు.. అనంతపురం జిల్లా తాడిపత్రి యువ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లాలోని అర్బన్ నియోజకవర్గంలో జరిగిన.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభలో అస్మిత్ రెడ్డి సంచలన ప్రసంగం చేశారు. ఇతర నాయకులు చేసిన ప్రసంగానికి భిన్నంగా అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆయన ప్రసంగం సీఎం చంద్రబాబును కూడా మంత్రముగ్ధుడిని చేశాయి. రాష్ట్రంలోని నాయకులను, రాజ్యాంగాన్ని …
Read More »వివేకా హత్యకు కదిరిలోనే గొడ్డలి కొన్నారు: టీడీపీ ఎమ్మెల్యే
ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల విజయోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా, అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. సంచలన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ఆయనకు సభలో ప్రసంగించేందుకు స్వల్ప సమయమే ఇచ్చినా.. కీలక వ్యాఖ్యలతో వైసీపీని టార్గెట్ చేస్తూ.. మాటల తూటాలు పేల్చారు. వైసీపీ …
Read More »వైసీపీ గురించి పచ్చి నిజం చెప్పిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగే దాదాపుగా రెండు గంటలకు పైగా మీడియా ప్రతినిధులను కూర్చోబెట్టి తన గోడు వెళ్లబోసుకున్న జగన్.. కావాలని చెప్పారో, లేదంటే నోరు జారి మరీ చెప్పారో తెలియదు గానీ… తన పార్టీ కీలక నేతలు, యాక్టివ్ కేడర్ గురించి ఆయన ఓ పచ్చి నిజాన్ని చెప్పేశారు. అదేంటంటే… తన …
Read More »అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది: చంద్రబాబు
అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా …
Read More »రప్పా రప్పా..ఇక్కడ సీబీఎన్, పవన్
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్…ఘోర ఓటమి తర్వాత వై నాట్ అపోజిషన్ అంటూ లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి జగన్ కూ తెలుసు. అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ …
Read More »మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్.. మారిన వ్యూహం!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్కు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి 2023లో జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న మాగంటి గోపీనాథ్ కొన్నాళ్ల కిందట అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే జరగనున్న ఉప పోరులో ఆయన సతీమణి సునీతకు టికెట్ ఖరారు చేసింది. వాస్తవానికి మాగంటి కుమారుడికి తొలుత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates